Radhika Kumaraswamy As Aghora : తెలుగు ప్రేక్షకులకు అఘోర అంటే గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'లో ఆయన డ్యూయల్ రోల్ చేయగా... అందులో ఒకటి అఘోర క్యారెక్టర్. అందులో ఆయన నటన, డైలాగ్ డెలివరీకి ప్రేక్షక లోకం అంతా నీరాజనం పలికింది. తెలుగు తెరపై బాలకృష్ణ తప్ప మరొక స్టార్ ఎవరూ అటువంటి క్యారెక్టర్ చేసే సాహసం చేయలేదు. కన్నడలో ఓ హీరోయిన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


'భైరా దేవి'లో అఘోరాగా రాధికా కుమార స్వామి
Bhairadevi Movie 2023 Release Date : ప్రముఖ కన్నడ కథానాయిక రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'భైరా దేవీ'. అందులో ఆమె అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. కన్నడలో కొన్ని రోజుల క్రితం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ అఘోర క్యారెక్టర్ చేయడంతో కన్నడలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.   


Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?


'భైరా దేవి'లో పోలీస్ రోల్ చేసిన రమేష్ అరవింద్
'భైరా దేవీ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.... త్రిశూలం చేత పట్టుకున్న రాధికా కుమార స్వామి రౌద్ర రసం చూపించారు. నేపథ్యంలో మరి కొంత మంది అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. ఇక... ఈ సినిమాలో సీనియర్ హీరో, దర్శకుడు రమేష్ అరవింద్ (Ramesh Aravind) కూడా నటించారు. ఆయనది పోలీస్ రోల్! వారణాసి, కాశీ, హరిద్వార్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. 


అఘోర పాత్రలో రాధికా కుమార స్వామి ఎలా నటించారు? ఈ సినిమా ఎలా ఉంటుంది? అని కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడతో పాటు తెలుగులో ఈ డిసెంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 


Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?



'భైరా దేవీ' చిత్రానికి శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు... రాధిక కుమార స్వామి నిర్మాతగా కూడా వ్యవహరించారు. రంగాయన రఘు, రవి శంకర్, స్కంద అశోక్, అను ముఖర్జీ, మాళవిక అవినాష్, సుచేంద్ర ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు : సి. రవిచంద్రన్, స్టంట్ మాస్టర్‌: రవి వర్మ, కళా దర్శకత్వం : మోహన్ బి కేరు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి (తెలుగు), ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవిరాజ్ & యాదవ్‌, ఛాయాగ్రహణం : జేఎస్ వాలి, సంగీత దర్శకుడు : కె.కె. సెంథిల్ ప్రసాద్.