పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. ప్రేక్షకులకు సినిమా గుర్తే! అయితే... అందులో సాయి ధరమ్ తేజ్ తమ్ముడి పాత్రలో నటించిన యువకుడు గుర్తు ఉన్నారా? అతని పేరు సూర్య శ్రీనివాస్. ఇప్పుడు అతను హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.


'జమానా' టైటిల్ ప్రోమో విడుదల చేసిన వెంకీ!
సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ హీరోలుగా రూపొందుతోన్న తెలుగు సినిమా 'జమానా'. శ్రీ ల‌క్ష్మీ వ‌ల్ల‌భ క్రియేష‌న్స్, విఎస్ అసోసియేట్స్ ప‌తాకాల‌పై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్క‌ర్ జ‌క్కుల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 'ఛలో', 'భీష్మ' వంటి సూప‌ర్‌ హిట్  సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ ప్రోమో విడుద‌ల అయ్యింది. 



టైటిల్ ప్రోమో విడుదల చేసిన అనంతరం వెంకీ కుడుముల మాట్లాడుతూ ''ఇప్పుడే 'జమానా' టైటిల్ ప్రోమో చూశా. ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు భాస్క‌ర్ జ‌క్కుల విజ‌న్ బాగా న‌చ్చింది. టైటిల్ ప్రోమోలో చార్మినార్ ద‌గ్గ‌రి షాట్ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ కూడా బాగా తీశారు. కథ ఏమిటో అడిగి తెలుసుకున్నా. కొత్త పాయింట్ చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్ర బృందానికి ఎటువంటి సహాయం కావాలన్నా నా టీమ్ అందుబాటులో ఉంటుంది. 'జమానా'లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూర్య శ్రీ‌నివాస్, సంజ‌య్‌ కుమార్... దర్శక నిర్మాతకు ఆల్ ది బెస్ట్‌'' అని అన్నారు. 


చార్మినార్, పాతబస్తీ నేపథ్యంలో 'జమానా'
చార్మినార్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో 'జమానా' కథ రెడీ చేసినట్లు చిత్ర ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ జ‌క్కుల తెలిపారు. యువతకు నచ్చే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నామని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా సినిమా టైటిల్ ప్రోమో విడుదల చేసిన వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్‌. దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. అయినప్పటికీ... కథపై నమ్మకంతో హీరోలు, నటీనటులు సాంకేతిక నిపుణులు ఎంతో అండగా నిలబడ్డారు. క‌థ‌పై నమ్మకంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమా ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌. త్వ‌ర‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు. 


Also Read  టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?


దర్శకుడు వెంకీ కుడుముల గారిది లక్కీ హ్యాండ్ అని, తాము అడిగిన వెంటనే తమ సినిమా టైటిల్ ప్రోమో విడుదల చేసిన ఆయనకు థాంక్స్ అని హీరో సూర్య శ్రీ‌నివాస్ తెలిపారు. ఈ తరం యువ‌త‌కు సంబందించి ఒక అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రానికి దర్శకుడు భాస్కర్ జక్కుల తెర‌కెక్కించారని ఆయన పేర్కొన్నారు. 


Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?



స్వాతి క‌ష్య‌ప్‌, జారా త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: 'రియ‌ల్' స‌తీష్‌ & రాబిన్ సుబ్బు, కూర్పు : ఎంఆర్ వ‌ర్మ‌, ఛాయాగ్రహణం : జ‌గ‌న్ .ఎ, సంగీతం: కేశ‌వ కిర‌ణ్‌, సహ నిర్మాతలు : బి. శ‌శికాంత్‌ & బి. శివ‌కాంత్‌, నిర్మాణ సంస్థలు : శ్రీ ల‌క్ష్మీ వ‌ల్ల‌భ క్రియేష‌న్స్, విఎస్ అసోసియేట్స్, నిర్మాత‌లు: తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, ర‌చ‌న‌ - ద‌ర్శ‌క‌త్వం: భాస్క‌ర్ జ‌క్కుల.