విప్లవ చిత్రాల కథానాయకుడు, దర్శక - నిర్మాత... పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తల్లి మరణించారు. ఆమె పేరు రెడ్డి చిట్టెమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లాలో నివసిస్తున్నారు. రౌతులపూడి మండలం, మల్లం పేటలోని స్వగృహంలో తుదిశ్వాస విచినట్టు తెలిసింది.


చలన చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ఆర్. నారాయణ మూర్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే... ఆయన కుటుంబ సభ్యుల గురించి అందరికీ తెలిసింది తక్కువ. తల్లిదండ్రులను, బంధువులను పరిశ్రమకు దూరంగా ఉంచారు నారాయణ మూర్తి. స్వతహాగా ఆయనకు మదర్స్ డే, ఫాదర్స్ డే వంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆయన సామాన్య జీవితం గడుపుతారు. ఆయన కుటుంబం కూడా సామాన్య జీవితం గడుపుతున్నారు.  


సాధారణంగా నారాయణ మూర్తి ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లో కనిపిస్తారు. అరుదుగా రంగుల దుస్తులు వేసుకుంటారు. అటువంటి సమయంలో తీసిన ఫోటోను మీరు కింద చూడవచ్చు. 


Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?


Also Read : సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత