సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ ను నాల్గో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను ఎలా వివాహం చేసుకుంటావ్ అంటూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు.. నరేష్ కి చాలా మంది ఆడవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయని ఆరోపణలు చేశారు.. మరోపక్క పవిత్రా లోకేష్ తన భార్య అంటూ సుచింద్రప్రసాద్ మీడియా ముఖంగా చెబుతున్నారు. 


ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రమ్య రఘుపతి.. పవిత్రాను చెప్పుతో కొట్టబోయిన వీడియో బాగా వైరల్ అయింది. రెండు రోజుల క్రితం పవిత్రా.. నరేష్ తో రిలేషన్ గురించి మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని అన్నారు. నరేష్ కూడా అదే చెబుతున్నారు. పవిత్రా తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. ఇద్దరూ ఫ్రెండ్స్ అని చెబుతూనే ఒకే హోటల్ నుంచి బయటకు రావడం చర్చనీయాంశమైంది. 


దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో వీరి రిలేషన్ కి సంబంధించి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ వివాదాల కారణంగా పవిత్రా లోకేష్ సినిమా అవకాశాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ వీలైనంతగా వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటుంది. అందుకే వివాదాల్లో ఉండే నటీనటులను తమ సినిమాల్లో తీసుకోవడానికి ముందుకురారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు పవిత్రా విషయంలో కూడా అదే జరుగుతోంది. 


తప్పు ఎవరిదనే సంగతి పక్కన పెడితే.. తమ సినిమాల్లో పవిత్రాను తల్లి పాత్రల్లో తీసుకోవడానికి నిర్మాతలు జంకుతున్నారు. రీసెంట్ గా ఈమెను రెండు భారీ బడ్జెట్ సినిమాల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. స్టార్ క్యాస్ట్ ఉన్న రెండు సినిమాల్లో తల్లి క్యారెక్టర్ కోసం ముందుగా పవిత్రా లోకేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఆమె వివాదాల్లో నిలవడం, అది కూడా ఎఫైర్ వార్తలు కావడంతో.. సినిమాల్లో తల్లి రోల్ పై నెగెటివ్ పబ్లిసిటీ వస్తుందేమోనని ఆమెని పక్కన పెట్టారట. ఆ విధంగా ఆమె రెండు సినిమా అవకాశాలు కోల్పోయింది. 


Also Read: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' - ట్రైలర్ అదిరిపోయింది!


Also Read: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!