'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'పుష్ప 2' స్టార్ట్ చేయనున్నారు. ఇదీ తెలిసిందే. త్వరలో 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్రేజీ అప్‌డేట్‌ ఏంటంటే... 'పుష్ప 2'కు కూడా సీక్వెల్ ఉంది.


అవును... 'పుష్ప 3' కూడా ప్లానింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ రోల్ చేసిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ కన్ఫర్మ్ చేశారు. ఓ మలయాళ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన... 'పుష్ప 3' ప్రిపరేషన్ కోసం ఇటీవల సుకుమార్ డిస్కస్ చేశారని చెప్పుకొచ్చారు. సో... 'పుష్ప' ఫ్రాంచైజీలో మరో సినిమా కూడా వస్తుందన్నమాట.


ఫహాద్ ఫాజిల్ చెప్పిన దాని ప్రకారం... 'పుష్ప 3'లో ఆయన ఉన్నారు. కథానాయికగా రష్మిక కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సునీల్, అనసూయ తదితరులు కంటిన్యూ అవుతారా? లేదా? అనేది పార్ట్ 2 విడుదలైన తర్వాత క్లారిటీ రావచ్చు.


Also Read : నాగ చైతన్య కాదు, ఆ తమిళ సినిమా రీమేక్‌లో రానా


'పుష్ప 3' న్యూస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. 'తగ్గేదే లే...' అంటూ పుష్పరాజ్ పాత్రలో ఆయన చూపించిన మేనరిజమ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. క్రికెట్ స్టేడియమ్స్, బాక్సింగ్ రింగ్స్, ఇంకా చాలా చోట్ల చాలా మంది 'తగ్గేదే లే' అంటూ బన్నీ మేనరిజమ్ ఫాలో అయ్యారు. 


Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?