Pushpa 2 11 Days Collections: బాక్సాఫీస్ వద్ద ‘పుష్ఫ 2’ అస్సలు ఆగడం లేదు. మొదటి ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు తర్వాతి ఐదు రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్కును కూడా దాటేసింది. 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్కును దాటింది. వసూళ్లలో ఆల్ టైమ్ టాప్ ఇండియన్ సినిమాగా నిలవడం కోసం రేసును ప్రారంభించింది. రూ.2000 వేల కోట్లు పైగా వసూలు చేసిన ‘దంగల్’ టాప్ ప్లేస్‌లో ఉంది. రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన ‘బాహుబలి 2’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా 11 రోజుల్లో రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసి టాప్-3కి చేరుకుంది.






హిందీలో వసూళ్ల జాతర...
ముఖ్యంగా ‘పుష్ప 2’ హిందీ వసూళ్ల జాతర ఇప్పట్లో ఆగేలా లేదు. 11వ రోజు కూడా ఈ సినిమా హిందీ వెర్షన్ రూ.54 కోట్ల నెట్‌ను వసూలు చేసింది. ఇది ఒక హిస్టారికల్ రికార్డు. మొత్తంగా 11 రోజుల్లో రూ.561 కోట్ల నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ సాధించింది. ఇక్కడ కూడా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో మూడో స్థానాన్ని ‘పుష్ప 2’ సాధించింది. మొదటి మూడు స్థానాల్లో రూ.627 కోట్లు వసూలు చేసిన ‘స్త్రీ 2’, రూ.585 కోట్లు వసూలు చేసిన ‘జవాన్’ ఉన్నాయి. ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఈ రికార్డును కూడా ‘పుష్ప 2’ దాటేసే అవకాశం ఉంది.


Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!


‘పీలింగ్స్’ వచ్చేసింది...
సినిమా రన్ పీక్‌లో ఉండగానే ‘పీలింగ్స్’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్‌ను టీ-సిరీస్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఎడిట్స్ కూడా ట్విట్టర్‌లో ప్రారంభం అయిపోయాయి. సినిమాలో ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వ్యూస్ పరంగా కూడా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉంది.


నెక్స్ట్ ఏంటి?
‘పుష్ప 2’ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఎవరికైనా నెక్స్ట్ ఏంటి? అనే ప్రశ్న తలెత్తడం సహజం. అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. త్రివిక్రమ్ ఇప్పటివరకు టచ్ చేయని జోనర్‌లో సినిమా చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇప్పటికే ప్రకటించారు. ‘పుష్ప 2’ సినిమా లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి