Producer  Pranay about  Animal Movie: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‘ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. రూ. 1000 కోట్ల మార్కును దాటేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ.950 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ సోదరుడు, ‘యానిమల్‘ నిర్మాత అయిన ప్రణయ్ కీలక విషయాలు వెల్లడించారు. మూవీ విషయంలో సందీప్ మాత్రం కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. ఈ సినిమాపై వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. 


 ఆ క్యారెక్టర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు- ప్రణయ్


‘యానిమల్‘ చిత్రంలో బాబీ డియోల్ పాత్రపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఈ క్యారెక్టర్ వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. “రణబీర్ కపూర్ ఈ చిత్రంలో రణ్‌విజయ్ సింగ్‌గా నటించారు. విలన్ గా బాబీ డియోల్ అబ్రార్ అనే పాత్రలో నటించారు. విలన్‌కి ముగ్గురు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు ఉంటారని సందీప్ నాకు చెప్పినప్పుడు, కచ్చితంగా ఈ విషయం ప్రజల్లో చర్చకు వస్తుందని భావించాను. నేను అనుకున్నదే నిజం అయ్యింది. కొంత మంది విలన్‌ ను ఫలానా వర్గానికి చెందిన వ్యక్తిగా చూపించారంటూ విమర్శలు చేశారు. అయితే, ఈ క్యారెక్టర్ రూపొందించడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. గత మూడు దశాబ్దాల్లో ఎంతో మంది బొట్టు పెట్టుకుని విలన్‌ పాత్రలు పోషించారు. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారు?” అని ప్రణయ్ ప్రశ్నించారు. 


ఆ విమర్శలు అవాస్తవం- ప్రణయ్


సందీప్ తన సినిమాల్లో ఫిమేల్ లీడ్ కు సరైన స్పేస్ ఇవ్వరని వచ్చిన విమర్శలపైనా ప్రయణ్ స్పందించారు. ఆ విమర్శలు అర్థ రహితం అన్నారు. “‘యానిమల్’ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రకు రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యతే ఉందని నేను భావిస్తున్నాను. నాలుగు పేజీల స్ర్కిప్ట్ ఉన్న కర్వా చౌత్ సీన్‌లో రణబీర్ కు కనీసం నాలుగు లైన్ల డైలాగులు కూడా లేవు. అంతేకాదు, ఈ సీన్ లో రణబీర్ ను రష్మిక కొడుతుంది. ఈ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఏకంగా 20 సార్లకు పైగా రణబీర్ ను కొట్టింది. ఎమోషన్ సీన్ పండాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు అన్నారు రణబీర్” అని చెప్పుకొచ్చారు. 


‘యానిమల్’ సినిమాలో అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ను బోల్డ్ గా, అత్యంత వయెలెన్స్ తో చూపించారు దర్శకుడు సందీప్. సినిమాను ఇలా కూడా తీయ్యెచ్చా? అని మేకర్స్ లోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేశారు. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.   


Read Also: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్‌ బాక్స్ బద్దలు