Salaar-Dunki: క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్ము రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అంతేకాదు, గ్లోబల్ బ్లాక్సాఫీస్ దగ్గర టాప్ 5లో  చోటు దక్కించుకున్నాయి. ‘సలార్’ మూడో స్థానంలో నిలవగా, ‘డంకీ’ నాలుగో స్థానాన్ని పొందింది.

  


గ్లోబల్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న ఇండియన్ మూవీస్


తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ‘సలార్’, ‘డంకీ’ సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయి."’బాహుబలి’ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘సలార్ పార్ట్ 1’ గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఏకంగా 39 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.324 కోట్ల) వసూళ్లతో మూడవ స్థానంలో నిలిచింది” అని తాజా నివేదిక వెల్లడించింది. ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ‘డంకీ’ మూవీ సైతం గ్లోబల్ మార్కెట్ లో మంచి వసూళ్లను సాధిస్తోంది. "బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, హిట్ మేకర్ రాజ్ కుమార్ హిరానీ ఇమ్మిగ్రేషన్ డ్రామా కామెడీ ‘డంకీ’ 22.9 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.190 కోట్ల) వసూళ్లతో నాల్గవ స్థానంలో ఉంది” అని అదే నివేదిక తెలిపింది.


గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్1గా నిలిచిన ‘ఆక్వామాన్’


అటు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్’ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రం తొలివారంలో ఏకంగా 108 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 898 కోట్లు) సాధించి టాప్ ప్లేస్ దక్కించుకుంది. ‘Wonka’ మూవీ 50.9 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.423 కోట్లు)  సాధించి నంబర్ 2వ చిత్రంగా నిలిచింది.  


దుమ్మురేపుతున్న ‘సలార్’ వసూళ్లు


‘సలార్’ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.402 కోట్లు వసూలు చేసినట్లు ‘సలార్’ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. "రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 402 కోట్లు వసూలు చేసింది” అని రాసుకొచ్చింది. ‘సలార్’ మూవీ కల్పిత రాజ్యం ఖాన్సార్‌ చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులైన దేవా, వరదరాజ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అనేది ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ పాత్రల్లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. అటు ఈ చిత్రంలో శృతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.  


‘డుంకీ’ గురించి..  


‘డుంకీ’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఓ పోస్టర్‌ను విడుల చేసింది." ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.157.22 కోట్లు వసూళు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్‌’ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన మూడో చిత్రం ‘డంకీ’. ఇందులో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది.


Read Also: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?