అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర సారీ చెప్పారు. ఎందుకు? అంటే... నేడు అఖిల్ అక్కినేని పుట్టినరోజు (Akhil Akkineni Birthday). ఈ సందర్భంగా 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు! హీరో బర్త్ డే అంటే... సెట్స్ మీద ఉన్న సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ రావడం కామన్! అయితే... 'ఏజెంట్' టీమ్ నుంచి ఏదీ రావడం లేదు.
"ఈ రోజు 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ పెద్ద సారీ. మేం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఉంటుంది. మేలో హయ్యస్ట్ క్వాలిటీ థియేట్రికల్ టీజర్ (Agent theatrical teaser in May) విడుదల చేస్తాం" అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో అఖిల్ అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అఖిల్ ఫ్రెండ్లీ నేచర్, డెడికేషన్ సినిమా ఇండస్ట్రీలో అతడిని ఎవరెస్టు అంత ఎత్తులో నిలబెడుతుందని ఆయన చెప్పారు.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న 'ఏజెంట్' హీరోగా అఖిల్‌కు 5వ సినిమా. ఇందులో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వక్కంతం వంశీ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు. మరి, ఇప్పుడు ఆ తేదీకి వస్తారో? లేదో?
Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర
అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి.