రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు మరుపురాని చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రామ్ గోపాల్ వర్మ(RGV).. అప్పట్లో ఎలా ఉండేవారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం చాలా తేడాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. వివాదాలు ఎక్కడున్నా వర్మ అక్కడ ఉంటారు. లేదా వర్మ ఉన్న చోటే వివాదాలు ఉంటాయి. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన స్వలింగ సంపర్కుల చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం’) విడుదలకు నోచుకోవడం లేదు. కొన్ని థియేటర్లు ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి నిరాకరించాయి. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానుందనగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ‘మా ఇష్టం’ విడుదలపై స్టే ఆర్డర్ ఇచ్చింది. 


ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ నిర్మాత నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించారు. గతంలో వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మరికొన్ని చిత్రాలకు ఫైనాన్స్ చేశారట. తనకు ఇవ్వాల్సిన డబ్బులు వర్మ తిరిగి ఇవ్వడం లేదని, ఇవి ఇచ్చేవరకూ 'మా ఇష్టం' విడుదలను అడ్డుకోవాలని ఆయన కోరడంతో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా, ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుందని నట్టి కుమార్ పేర్కొన్నారు. దీంతో సినిమా హాళ్ల యాజమాన్యం కూడా వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే, వర్మ మాత్రం ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిల రొమాన్స్ ఉందనే కారణంతోనే థియేటర్లు విడుదలకు అంగీకరించడం లేదని అంటున్నారు. పైగా, వర్మ పుట్టిన రోజు (ఏప్రిల్ 7, గురువారం) రోజునే ఈ ‘బాంబు’ పడటం గమనార్హం. 


Also Read: 'మా ఇష్టం' విడుదల చేయడానికి వీల్లేదు - కోర్టు స్టే ఆర్డర్


ఇంత వివాదం నడుస్తున్నా వర్మలోని ఆ ‘రాము ఇజం’ ఇంకా అలాగే ఉంది. కొండ సుశ్మిత ఇచ్చిన డ్రెస్ వేసుకుని.. బుద్ధిమంతుడిలో పోజు కొడుతున్న ఫొటోను పోస్ట్ చేసి.. ‘‘సాంప్రదాయ దుస్తులు వేసుకున్న ఈ బర్త్ డే బాయ్‌ను ఎవరూ విష్ చేయొద్దు’’ అని ట్వీట్ చేశారు. ఇంకేముంది.. ఆయన అభిమానులు కూడా ఆయన టైపే. వద్దంటే వింటారా? ఒకటే జోకులు, ఫన్నీ మీములు.. గ్యాప్ లేకుండా ఆయనకు విషెస్ పంపుతూనే ఉన్నారు. ఎవరెవరు ఎంత ఫన్నీగా విష్ చేశారో చూద్దామా!


Also Read: ‘నేను ప్రార్థిస్తున్నా’ వరుణ్ తేజ్‌కు లావణ్య ట్వీట్, దొరిపోయావంటున్న ఫ్యాన్స్!