నేచురల్ స్టార్ నాని (Hero Nani), హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) జంటగా ఓ సినిమా చేశారు. అదే 'నానీస్ గ్యాంగ్ లీడర్'. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనుందా? వాళ్ళిద్దరితో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది.


వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో...
నాని, ప్రియాంకా మోహన్ జంటగా!
వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఆల్రెడీ నాని ఓ సినిమా చేశారు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'అంటే సుందరానికీ' సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో కలెక్షన్స్ రాలేదు. కానీ, ఆ సినిమా అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంతో ప్రేమ చూపించారు. సోషల్ మీడియాలో 'అంటే సుందరానికీ' కల్ట్ క్లాసిక్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక, లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే...


వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఆ సినిమాలో కథానాయికగా ప్రియాంకా అరుల్ మోహన్ ఎంపిక అయ్యారని, ఆమెను ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం.


డీవీవీ దానయ్య నిర్మాణంలో ఆల్రెడీ ప్రియాంకా అరుల్ మోహన్ ఓ సినిమా చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు డీవీవీ మూవీస్ నిర్మాణ సంస్థలో మరో ఛాన్స్ సొంతం చేసుకున్నారు. తొలుత ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేతో పాటు మరికొంత మంది హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలించారు. చివరకు, ప్రియాంకకు ఓటు వేశారు. 


Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?


ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ కలయికలో వచ్చిన 'అంటే సుందరానికీ' సినిమాతో పాటు అంతకు ముందు వివేక్ ఆత్రేయ తీసిన 'బ్రోచేవారెవరురా' సినిమాకు కూడా వివేక్ సాగర్ వర్క్ చేశారు. ఈ సినిమాకు ముందు ఏఆర్ రెహమాన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే... చివరకు, వివేక్ సాగర్ వైపు మొగ్గు చూపారట.   


Also Read : బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్



ప్రియాంకా అరుల్ మోహన్ విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో పాటు తమిళ స్టార్ ధనుష్ సరసన 'కెప్టెన్ మిల్లర్' కూడా చేస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే సినిమాలో కూడా కథానాయికగా ఆమెను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ టాక్. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial