రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియన్ మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మార్నింగ్ షో సమయంలో నెగెటివ్ టాక్ వినిపించినా, ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసేందుకు పోటెత్తారు. రివ్యూలతో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, రెండో  కలెక్షన్స్  భారీగా తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే తొలి రోజుతో పోల్చితే రెండో రోజు సగానికి పైగా కలెక్షన్లు పడిపోయాయి.

  


తొలి రోజు దుమ్మురేపిన వసూళ్లు


ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల నటించింది. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రామ్ కెరియల్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో థండరింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.  తొలి రోజు ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 3.23 కోట్లు సాధించినట్లు తెలిపింది. సెడెడ్ లో రూ. 1.22 కోట్లు వసూళు చేసినట్లు తెలిపింది. వైజాగ్ లో రూ. 1.19 కోట్లు, తూర్పు గోదావరిలో లో రూ. 59 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 41 లక్షలు, కృష్ణలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 1.04 కోట్లు, నెల్లూరులో రూ. 49 లక్షలు సాధించింది. మొత్తంగా తొలి రోజు రూ.8.62 కోట్లు వసూళ్లు చేసింది.  


రెండో రోజు సగానికి పైగా పడిపోయిన కలెక్షన్లు


ఇక రెండో రోజు ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.52 కోట్లు సాధించింది. సీడెడ్ లో రూ. 54 లక్షలు, వైజాగ్ లో రూ.  41 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 27 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.17 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, గుంటూరులో  రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలు వసూళు చేసింది. మొత్తంగా రెండో రోజు రూ. 3.49 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజు సగానికిపైగా వసూళ్లు పడిపోయాయి.


రూ. 49 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్


అటు ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.43 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 3 కోట్లు వచ్చాయి.  సుమారు రూ. 40 కోట్లకు హిందీ డిజిటల్, శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ జీ గ్రూప్ తీసుకుంది.  ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 2.20 కోట్లు వచ్చాయట. మొత్తం మీద 'స్కంద' సినిమాకు రూ. 49 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు అంచనా. 


Read Also: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial