తమిళ అగ్ర హీరోలలో ఒకరు & దళపతి విజయ్ (Tamil Hero Vijay), ప్రజెంట్ ఆడియన్స్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'కత్తి'తో అనిరుధ్, విజయ్ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత 'బీస్ట్', 'మాస్టర్' సినిమాలు వచ్చాయి. హిట్టూ ఫ్లాపులు పక్కన పెడితే... పాటలు, నేపథ్య సంగీతం సూపర్ హిట్ అయ్యాయి. 


విజయ్ లేటెస్ట్ సినిమా 'లియో'కి కూడా అనిరుధ్ సంగీత దర్శకుడు. హీరోతో తనకు ఉన్న అనుబంధం గురించి, ఫస్ట్ సినిమా ఆడియో సక్సెస్ తర్వాత విజయ్ తనకు ఇచ్చిన గిఫ్ట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన రివీల్ చేశారు. 


'కత్తి' సినిమాలో 2014లో విడుదల అయ్యింది. ఆ ఏడాది తమిళంలో చార్ట్ బస్టర్ ఆల్బంలలో 'కత్తి' ఒకటిగా నిలిచింది. ఆడియో సూపర్ హిట్ అయ్యాక... తనకు విజయ్ ఓ పియానోని బహుమతిగా పంపించారని చెప్పారు. కొత్త సినిమా ట్యూన్స్ ఏవైనా సరే... ఆ పియానో మీద ముందు ప్లే చేస్తానని అనిరుధ్ తెలిపారు. డైరెక్టర్ ఆ ట్యూన్ ఓకే చేస్తే రికార్డ్ చేస్తానని, లేదంటే లేదని ఆయన పేర్కొన్నారు.


Also Read : ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది, మీరూ చూడండి
  
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' సక్సెస్ తర్వాత హిందీ సినిమా ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ పేరు బలంగా వినబడుతోంది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాకు కూడా ఆయన సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'లియో'తో విజయ దశమికి మరోసారి అనిరుధ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమాలో సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. 
తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', తమిళంలో రజనీకాంత్ నెక్స్ట్ సినిమా, కమల్ హాసన్ 'ఇండియన్ 2'కు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు.


Also Read : పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్



 
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial