డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తే.. ఇక ఈ మూవీకి క్రియేట్ అయ్యే హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలా సినిమాలు తెరకెక్కించే నటులలో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. తన పర్సనల్ లైఫ్‌లో తట్టుకోలేని విషాదం జరిగినా కూడా ప్రొఫెషనల్ లైఫ్‌పై ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా మ్యానేజ్ చేస్తున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో. తాజాగా విజయ్ ఆంటోనీ అప్‌కమింగ్ మూవీ ‘హిట్లర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను టీమ్ అంతా కలిసి రిలీజ్ చేశారు. ‘హిట్లర్’ ఫస్ట్ లుక్ లాంచ్‌లో విజయ్ ఆంటోనీ మాత్రం పాల్గొనలేకపోయారు.


ఆసక్తికరమైన మోషన్ పోస్టర్..
మామూలుగా విజయ్ ఆంటోనీ చేసే ప్రతీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ‘హిట్లర్’ కూడా అదే విధంగా ఉంది. ట్రెయిన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ.. ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కున్నట్టు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇదే ట్రెయిన్ లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. గన్ పేలుస్తున్నట్టుగా గౌతమ్ మీనన్ పాత్రను కూడా ఈ మోషన్ పోస్టర్‌లో పరిచయం చేసింది మూవీ టీమ్. తన ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే.. ‘హిట్లర్’ మోషన్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చివర్లో హీరో ఒక జోకర్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌ను స్పష్టంగా చూస్తుంటే.. ట్రెయిన్ జర్నీ అనేది ఇందులో కీలకంగా ఉంటుందని అర్థమవుతోంది.


మళ్లీ ఆ సంస్థతోనే..
చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఇప్పటికే విజయ్ ఆంటోనీ.. ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని చేశారు. ఇప్పటికీ ఈ సంస్థ.. 6 సినిమాలు తెరకెక్కించగా.. ‘హిట్లర్’ ఏడవ చిత్రంగా తెరకెక్కనుంది. ధన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు డీటీ రాజా, డీఆర్ సంజయ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మామూలుగా విజయ్ ఆంటోనీ నటించే ప్రతీ సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అదే విధంగా ‘హిట్లర్’లో కూడా ప్రజాస్వామ్యం పేరుతో పాలకులు చేస్తున్న నియంత పాలనను ఎదుర్కోవడానికి హీరో ముందుకొస్తాడు. ఆ హీరో కథే ‘హిట్లర్’ అని మూవీ టీమ్ అంటోంది.


ప్యాన్ ఇండియా రేంజ్‌లో..
‘హిట్లర్’ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టనుంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ‘హిట్లర్’ రిలీజ్ కానుంది. ‘హిట్లర్’ కోసం మొదటిసారిగా విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జతకట్టనున్నారు. వివేక్, మెర్విన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీకి మ్యూజిక్‌ను అందించారు. డైరెక్షన్‌కంటే ఎక్కువగా యాక్టింగ్‌పై దృష్టిపెట్టిన గౌతమ్ వసుదేవ్ మీనన్. ‘హిట్లర్’లో విజయ్ ఆంటోనీతో తలపడే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.


Also Read: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial