Rajinikanth Dhanush Movies Clash At Pongal 2024 : సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉంటాయి? ఎన్ని వెనక్కి వెళతాయి? అని తెలుగు పరిశ్రమలో, ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. చివరి మిగిలే సినిమాలు ఏవి? అంటూ ఓ లిస్టు కూడా ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిళ్లలో తిరుగుతోంది. అది పక్కన పెడితే... తమిళ సినిమాలు రెండు సంక్రాంతి బరిలో ఉండటం చెన్నై సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు కారణం అవుతోంది. 


లాల్ సలామ్ వర్సెస్ కెప్టెన్ మిల్లర్
Lal Salaam Vs Captain Miller : సంక్రాంతికి విడుదల అవుతున్న రెండు సినిమాల్లో ముఖ్యమైనవి 'లాల్ సలామ్', 'కెప్టెన్ మిల్లర్'. మొదటి సినిమాలో రజనీకాంత్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. రెండో సినిమాలో ధనుష్ హీరో. అందువల్ల, ఈ రెండిటి మధ్య పోటీని ఎలా చూడాలో అంటూ గుసగుసలు మొదలు అయ్యాయి.


రజనీకాంత్ అల్లుడు అంటే తమిళ ప్రేక్షకుల మదిలో మెదిలే పేరు ధనుష్. సూపర్ స్టార్ అల్లుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ధనుష్ నటన, అతని ప్రతిభను తక్కువ అంచనా వేయడం కాదు కానీ... రజనీ అల్లుడు ఇమేజ్ విజయాల్లో ఆయనకు ఎంతో కొంత సాయం చేసిందనేది వాస్తవం. అయితే... ఇప్పుడు వాళ్ళు మామా అల్లుళ్లు కాదు.
 
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, ధనుష్ వేరు పడ్డారు. కొన్నాళ్ళ క్రితం వాళ్లిద్దరూ సంయుక్తంగా విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కూడా! మళ్ళీ కలిశారని వార్తలు వచ్చాయి గానీ... అందులో నిజం ఉన్నట్లు కనిపించలేదు. దీపావళికి కుమారులు ఇద్దరూ తాతయ్య రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలను ఐశ్యర్య పోస్ట్ చేశారు. కానీ, ఆవిడతో ధనుష్ కలిసిన ఫోటోలు బయటకు రాలేదు. ఇక సంక్రాంతి పోటీకి వస్తే...  


ఐశ్వర్య రజనీకాంత్ కొంత విరామం దర్శకత్వం వహించిన సినిమా 'లాల్ సలామ్'. ఇంతకు ముందు ఆవిడ ధనుష్ హీరోగా 'త్రీ' తీశారు. 'వై థిస్ కొలవెరి డి' పాట ఆ సినిమాలోనిదే. ఇప్పుడీ 'లాల్ సలామ్'లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలు కాగా... రజనీకాంత్ (Rajinikanth) ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. మరోవైపు ధనుష్ (Dhanush) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'ను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. 


Also Read టాలీవుడ్‌లో మరో విషాదం - చంద్ర మోహన్ మరణించిన రోజే 'రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్' నిర్మాత రవీంద్ర బాబు మృతి  






డిసెంబర్‌ నుంచి సంక్రాంతికి వెళ్లిన ధనుష్‌
నిజం చెప్పాలంటే... 'కెప్టెన్ మిల్లర్' సినిమాను ముందు డిసెంబర్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అది విడుదలైన తర్వాత 22న 'సలార్' వస్తుందనో? మరొకటో? సంక్రాంతికి వాయిదా వేశారు. ఆల్రెడీ ధనుష్ కంటే ముందు తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తండ్రి కుమార్తెలు రజనీకాంత్, ఐశ్వర్య అనౌన్స్ చేశారు. మాజీ భార్య సినిమాకు పోటీగా తన సినిమాను ధనుష్ విడుదల చేస్తున్నారా? లేదంటే మామ రజనీ మీదకు పోటీకి దిగుతున్నారా? ఈ పోటీ మీద విడుదల సమయంలో రజనీకాంత్, ధనుష్, ఐశ్వర్య ఎలా స్పందిస్తారో చూడాలి. 


Also Read అర్థం చేసుకోండి... బాలీవుడ్ సింగర్‌తో మృణాల్ ఠాకూర్ లవ్ ఎఫైర్!?