Polimera 2 Producer Write Letter to Dil Raju: 'పొలిమేర 2' వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పొలిమేర 2 నిర్మాత పొలిమేర 3 నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మూవీ లాభాల్లో వాట అడిగినందుకు చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ పొలిమేర 2 నిర్మాత గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన కంటెంట్ రిలేటెడ్‌గా పార్ట్ 3లో లేకుండా సినిమా తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం సినీ పెద్దల వరకు వెళ్లింది. ఈ విషయంలో నిర్మాత గౌరీ కృష్ణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
తాజాగా ఈ లేఖను ఆయన విడుదల చేశారు. ఈ లేఖలో గౌరీ కృష్ణ ఇలా రాసుకొచ్చారు. తాను నిర్మించిన పొలిమేర 2 లాభాల్లో తన వాట అడిగినందుకు చంపేస్తానని బెదిరించిన నందిపాటి వంశీపై గత ఏడాది నవంబర్ 27వ ఫిర్యాదు చేశానని, దయచేసి దానిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో ఏముందంటే.. "ఫిలిం ఛాంబర్ కి చెందిన నిర్మాత ప్రసన్నకుమార్ తమ గొడవలో కలుగజేసుకుని పవర్‌ని మిస్ యూస్ చేస్తూ ఛాంబర్ తరపున నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకం చేయాలని కూడా బెదిరిస్తున్నారని, మరోపక్క నందిపాటి వంశీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు.
వంశీ నందిపాటి పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేశాడు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటివరకు నాకు ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పడం లేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేటప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర బ్లాంక్ చెక్కులు సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బాండ్ పేపర్లు సెక్యూరిటీ నిమిత్తం తీసుకున్నారు. ఇప్పుడు వాటి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు" అని లేఖలో పేర్కొన్నారు. అనంతం "పొలిమేర 3 సినిమాని నాకు చెప్పకుండానే ప్రకటన ఇచ్చారు. పొలిమేర 2 సినిమా నిర్మాతగా నాకున్న హక్కులను ధిక్కరించడమే అవుతుంది. వీలైనంత త్వరగా ఛాంబర్ ఈ విషయంలో కలగజేసుకొని నాలాంటి చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఈ విషయాన్ని త్వరితగతిన పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. అలాగే పొలిమేర 2 కలెక్షన్స్ వివరాలు నాకు ఇవ్వాల్సిందిగా.. అదే విధంగా నేను సంతకం చేసిన డాక్యుమెంట్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.
పొలిమేర స్త్రీలో పొలిమేర 2కి సంబంధించిన కంటెంట్ వాడకుండా చూడాలని కూడా కోరుతున్నాను" అంటూ ఆయన లేఖ రాసుకొచ్చారు. ఇక దీని మీద దిల్ రాజు స్పందించాల్సి ఉంది. కాగా లాక్‌డౌన్‌లో నేరుగా ఓటీటీలో రిలీజైన పొలిమేర మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' థియేటర్లో రిలీజ్ అయ్యింది. మొదట మిక్స్‌డ్ టాక్ రాగా ఆ తర్వాత రన్ టైం మంచి వసూళ్లు చేసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా మూడో పార్ట్‌కు కూడా రెడీ అయ్యింది. ఇటీవల పొలిమేర 3ని ఆఫీషియల్ అనౌన్స్ చేశారు కూడా. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో 'పొలిమేర 2' నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
Also Read: లావణ్యపై రాజ్ తరుణ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు - ఆమె పచ్చి తాగుబోతు.. పదేళ్లు మాకు నరకం చూపించింది!