ఏపీ ఎన్నికలు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య దూరం పెంచాయని విశ్లేషకులు చెప్పే మాట. ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి బన్నీ వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, జనసేనానిని అభిమానించే ప్రజలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. వాటిపై 'హైపర్' ఆది స్పందించారు.
నేషనల్ అవార్డు విన్నర్ మీద ట్రోల్స్ ఆపేయాలి! - 'హైపర్' ఆది
అశ్విన్ బాబు హీరోగా నటించిన 'శివం భజే'లో 'హైపర్' ఆది ఓ పాత్ర చేశారు. ఆగస్టు 1వ తేదీన ఆ సినిమా విడుదల అవుతోంది. ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్ ట్రోల్స్ గురించి ప్రస్తావన రాగా... ''అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్ అండీ. ఆయన మీద ట్రోల్స్ చేసే వారికి నేను ఒక్కటే చెబుతున్నా. కళ్యాణ్ గారికి కానీ, మెగా కుటుంబ సభ్యులకు గానీ అటువంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి... నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ గారి మీద ట్రోల్స్ ఆపేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. మరి, దీనిపై అభిమానులు గానీ, ట్రోల్స్ చేసే వారు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: కంగువ ఫస్ట్ సాంగ్... ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!
ఇటీవల 'ఆయ్' సినిమా ప్రెస్‌మీట్‌లోనూ అల్లు అర్జున్ ఆప్తుడు, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు 'బన్నీ' వాస్ సైతం ఈ ట్రోల్స్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఈవెంట్ చాలు అని, ఆ ఒక్క అకేషన్ కోసం తాను ఎదురు చూస్తున్నాని 'బన్నీ' వాస్ పేర్కొన్నారు.
Also Read: కంగువ క్లైమాక్స్‌లో ఖైదీ - అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ అప్పియరెన్స్!
ఆదిని జనసేన పార్టీ ఎమ్మెల్సీ చేస్తుందా?
ఎన్నికలకు ముందు జనసేన ప్రచారంలో 'హైపర్' ఆది పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రత్యర్థుల మీద మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జనసేన పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, వాటిలో నిజం ఎంత? అని ప్రశ్నించగా... ''అటువంటివి ఏమీ లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే? ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడటం ఇష్టం. ఆయన బాధలో ఉంటే దగ్గరకు వెళ్లి చూసుకోవడం ఇష్టం. అంతే!'' అని సమాధానం ఇచ్చారు.
Also Read: సూర్య భాయ్... గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టిన స్టార్ హీరో, రోలెక్స్‌ను బీట్ చేస్తాడా?