Suriya 44 New Glimpse Released: గ్యాంగ్‌స్టర్‌, మాఫియా నేపథ్యంలో సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ కోలీవుడ్ స్టార్ సూర్యకు ఉంది. లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో ఆయన రోలెక్స్ క్యారెక్టర్ అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! అంతకు ముందు 'సికిందర్' (తమిళంలో 'అంజాన్') సినిమాలోనూ సూర్య గ్యాంగ్‌స్టర్‌ రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా క్యారెక్టర్ చేశారు.


న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య (Suriya) ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన 44వ చిత్రమిది. అందుకని Suriya 44 అని వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.


గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్ చేసిన సూర్య...!
Suriya 44 Glimpse Review: సముద్రం మధ్యలోని ఓ దీవిలో రాయల్ ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్ ఎంట్రీకి అటు ఇటు పది మంది ఉన్నారు. 'లవ్, లాఫ్టర్, వార్' అని అక్షరాలు వచ్చాయి. ఆ తర్వాత సూర్య ఎంట్రీ ఇచ్చారు. ముఖం మీద రక్తపు మరకలతో సూర్య సిగరెట్ కలుస్తూ వచ్చారు. ఆ తర్వాత అతడికి ఓ వ్యక్తి గన్ ఇచ్చారు. దీన్ని బట్టి చేతిలో ఎటువంటి ఆయధం లేకుండా ఎవరినో హీరో చితకొట్టాడని లేదా చంపి ఉంటాడని అనుకోవాలి. ఆయన గ్యాంగ్‌స్టర్‌ రోల్ చేశారని గ్లింప్స్ ద్వారా అర్థం అయ్యింది.


Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా






సూర్య 44 లుక్ చూస్తే కాస్త రోలెక్స్ పాత్రకు దగ్గర దగ్గరగా ఉంది. గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్లలో రోలెక్స్ ఒక ట్రెండ్ సెట్టర్. ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. మరి, దాన్ని ఈ సినిమా మ్యాచ్ చేస్తుందో? లేదో? వెయిట్ అండ్ సి.


Also Readరవితేజ కొత్త సినిమా యంగ్ హీరోకి విలన్ ఛాన్స్ - విక్రమ్ రాథోడ్ రేంజ్‌ రోల్‌తో!



సూర్య సరసన కథానాయికగా పూజా హెగ్డే!
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ఎం స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకాలపై రూపొందుతోంది. దీనికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన వీడియోలో ఆయన నేపథ్య సంగీతం బావుంది. ఈ సినిమాతో పాటు శివ దర్శత్వంలో 'కంగువా' సినిమా చేస్తున్నారు సూర్య. అది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా మీద సైతం భారీ అంచనాలు ఉన్నాయి.


Also Read: మగధీర విలన్ దేవ్ గిల్ హీరోగా 'అహో విక్రమార్క' - పాన్ ఇండియా రిలీజ్ ఎప్పుడంటే?