దేవ్ గిల్ (Dev Gill) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'మగధీర'. అందులో ఆయన విలనిజం ఎంతో మందికి నచ్చింది. ఆ తర్వాత 'రగడ', 'ప్రేమ కావాలి', 'పూల రంగడు', 'రచ్చ', 'నాయక్', 'వకీల్ సాబ్' తదితర సినిమాల్లో నటించారు. హిందీలో సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3', తమిళంలో రజనీకాంత్ 'లింగా'తో పాటు పలు హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా 'అహో! విక్రమార్క' (Aho Vikramarka) తెరకెక్కింది. ఆ సినిమా విడుదల తేదీని ఈ రోజు అనౌన్స్ చేశారు. 


ఆగస్టు 30న 'అహో విక్రమార్క' విడుదల
Aho Vikramarka Release Date: దేవ్ గిల్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'అహో! విక్రమార్క'. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఈ సినిమాను దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మాతలు. 


ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 'అహో విక్రమార్క'ను భారీ ఎత్తున సినిమా విడుదల చేయనున్నట్టు ఇవాళ వెల్లడించారు. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు.


'అహో! విక్రమార్క' విడుదల సందర్భంగా హీరో దేవ్ గిల్ మాట్లాడుతూ... ''ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పోలీసులు ఎంత ధైర్యంగా తమ విధులు నిర్వర్తిస్తారు? ఎంత అకింత భావంతో ఉద్యోగం చేస్తారు? అనేది మా సినిమాలో చాలా గొప్పగా చూపించబోతున్నాం. సినిమా ఫస్ట్ కాపీ చూశా. చాలా బాగా వచ్చింది. ఆగస్టు 30న పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం. ప్రేక్షకులు ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో మాత్రమే చూశారు. ఈ సినిమాతో మరో కోణాన్ని చూస్తారు'' అని చెప్పారు.


Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా


దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ... ''పోలీసుల పవర్‌ తెలియ‌జేసేలా ఈ సినిమా తెరకెక్కించా. మేం ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం రూపొందించాం. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ ఆల్రెడీ విడుదల చేశాం. ఇందులో దేవ్ గిల్ (Dev Gill As Police Officer)ను ప్రేక్షకులు స‌రికొత్త‌గా చూస్తారు. ఆగస్టు 30న మా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది'' అని అన్నారు.


Also Read: రవితేజ కొత్త సినిమా యంగ్ హీరోకి విలన్ ఛాన్స్ - విక్రమ్ రాథోడ్ రేంజ్‌ రోల్‌తో!



Aho Vikramarka Movie Cast And Crew: దేవ్ గిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో షాయాజీ షిండే, ప్రవీణ్ తార్ డే, తేజస్విని పండిట్, చిత్రా శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, 'బిత్తిరి' సత్తి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కరమ్ చావ్లా - గురు ప్రసాద్. ఎన్, కూర్పు: తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే, స్టంట్స్: 'రియల్' సతీష్, కథ: పెన్మెత్స ప్రసాద్ వర్మ, సంగీతం: రవి బస్రూర్ - ఆర్కో ప్రవో ముఖర్జీ, నిర్మాతలు: ఆర్తి దేవిందర్ గిల్ - మీహిర్ కుల్జర్ని - అశ్విని కుమార్ మిస్రా, దర్శకత్వం: పేట త్రికోటి.