Karthi joins Kanguva cast: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా 'కంగువ'. పాన్ ఇండియా సినిమాలను హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల చేయడం కామన్. కానీ, ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదొకటి. ఇప్పుడు సూర్య అభిమానులకు మరొక గుడ్ న్యూస్. 






'కంగువ'లో కార్తీ స్పెషల్ అప్పియరెన్స్!
Kanguva Guest Appearance Star Cast Name: 'కంగువ'లో బ్రదర్స్ సందడి చేయనున్నారని సమాచారం. అన్నయ్య సూర్య కోసం తమ్ముడు కార్తీ అతిథి పాత్ర చేశారట. అది పతాక సన్నివేశాల్లో వస్తుందని కోలీవుడ్ టాక్. మరి, ఆ రోల్ ఎలా ఉంటుంది? కార్తీ స్క్రీన్ మీద ఎంత సేపు కనిపిస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 






నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ చేతికి 'కంగువ'
Kanguva Release Date 2024: 'కంగువ' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారు. 'కంగువ' నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైతీ మూవీ మేకర్స్ కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. ఆ సంస్థ ద్వారా సినిమా విడుదల కానుంది. ఏపీ, సీడెడ్ రైట్స్ కోసం భారీ క్రేజ్ నెలకొంది.


Also Read: సూర్య భాయ్... గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టిన స్టార్ హీరో, రోలెక్స్‌ను బీట్ చేస్తాడా?



ఇటీవల పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల అయ్యాయి. 'కంగువ' చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడుతోంది.


Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా



'కంగువ' చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రలు చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రీడీలోనూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నిశాద్ యూసుఫ్, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, యాక్షన్: సుప్రీమ్ సుందర్, మాటలు: మదన్ కార్కే, కథ: శివ - ఆది నారాయణ, కాస్ట్యూమ్ డిజైనర్: అను వర్ధన్ - దష్ట పిళ్లై, కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా - వంశీ - ప్రమోద్, దర్శకత్వం: శివ.