మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కిన తాజా తెలుగు సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). ఇందులో అశ్విన్ బాబు (Ashwin Babu) హీరో. అప్సర్ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన చిత్రమిది. ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉంది? అనేది చూస్తే...


టెర్రరిజం నేపథ్యంలో 'శివం భజే'
Shivam Bhaje Movie Trailer Review: 'వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగు అయిపోవాలి' - 'శివం భజే' ట్రైలర్ ప్రారంభంలో వినిపించే మాట. ఆ వెంటనే త్రివర్ణ పతాకాన్ని, కాశ్మీర్ లోయలో మంచు కొండలను, తీవ్రవాదుల్ని చూపించారు. దీంతో టెర్రరిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈజీగా అర్థం అవుతోంది. పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు డ్రాగన్ దేశానికి చెందిన అధికారులను కూడా తెరపై చూపించారు. దాంతో చైనా పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. 


Ashwin Babu Role In Shivam Bhaje: 'ఈసారి ఏదో భారీ ప్లానింగ్ చేస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి సార్. ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఇండియాకు ఓ స్పెషల్ ఏజెంట్ అవసరం' అని నటుడు మయాంక్ పరాఖ్ డైలాగ్ చెప్పిన తర్వాత అశ్విన్ బాబును చూపించారు. సో... ఆయన స్పెషల్ ఏజెంట్ అని చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇరగదీశారు.


బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నటి, 'బిగ్ బాస్' ఫేమ్ ఇనయా సుల్తానాతో పాటు తమిళ నటుడు సాయి ధీనా సైతం పోలీస్ రోల్స్ చేశారు. 


వరుస హత్యలకు కారణం ఎవరు? హీరోపై ఎటాక్!
టెర్రరిజం పక్కన పెడితే... దేశం లోపల వరుస హత్యలు జరుగుతాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అని ఆలోచిస్తున్న సమయంలో హీరో మీద ఎటాక్ జరుగుతుంది. అది ఎవరు చేశారు? తర్వాత ఏమైంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హీరోని ఆస్పత్రికి తీసుకు వెళుతున్న సమయంలో హీరోయిన్ దిగంగనా సూర్యవంశీని సైతం చూపించారు. హీరో తల్లి పాత్రలో తులసి కనిపించారు. 


'ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు' అని హీరోయిన్ దిగంగనా చెప్పడం... 'చంపే చెయ్యి కనిపిస్తుంది గానీ చంపింది ఎవరో తెలియడం లేదు' అని హీరో చెప్పడం చూస్తుంటే ఆయన మీద అనుమానం కలిగించేలా ఉంది. 


Also Read: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్



ఆట మొదలు పెట్టిన శంకరుడు... ఆయన కన్నెర్ర జేస్తే?
'ఆట మొదలెట్టావా శంకరా' అని అయ్యప్ప శర్మ అనడంతో ట్రైలర్ కొత్త మలుపు తీసుకుంది. నేపథ్యంలో వినిపించే శివుని పాట గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. 'నిన్ను చంపిన వాళ్ళ అంతం చూసే వరకు...' అని హీరో డైలాగ్ చెప్పిన తర్వాత ఆ పరమ శివుడు కిందకు దిగి రావడం చూస్తుంటే... థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అనిపిస్తోంది.


Also Readకంగువ ఫస్ట్ సాంగ్... ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!