పవర్ స్టార్ పవన్ కల్యాణ్, 'సాహో' దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోందని, ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయనేది లేటెస్ట్ ఖబర్. దీనిని డీవీవీ దానయ్య నిర్మిచనున్నారనేది ఆ వార్తల సారాంశం. అదీ ఓ రీమేక్ సినిమా అని, తమిళ స్టార్ హీరో విజయ్ 'తేరి'ని తెలుగులో తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంత? అనే వివరాల్లోకి వెళితే...


విజయ్ 'తేరి'ని పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే. అయితే... అది సుజీత్ దర్శకుడిగా కాదు! 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా! అది కూడా నిర్మాత డీవీవీ దానయ్య కాదు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రీమేక్ చేయాలనుకున్నారు. 
తెలుగులో 'తేరి' సినిమా 'పోలీస్'గా విడుదలైనా... స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత రవితేజ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు. ఒక ఫైట్ కూడా షూట్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే... రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్లాప్ కావడంతో ఈ రీమేక్ సినిమాను పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకుంటున్నారా? అంటే...


Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?


రీమేక్ సినిమా కంటే ఒరిజినల్ కథతో సినిమా చేస్తే బావుంటుందనేది దర్శకుడు సుజీత్ ఆలోచనగా తెలుస్తోంది. 'సాహో' తర్వాత ఆయన మరో సినిమా అంగీకరించలేదు. అయితే... ఆయనతో సినిమా చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య ఆసక్తి చూపిస్తున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అది రీమేక్ సినిమానా? మరొకటా? అనేది తెలియాలంటే... డిస్కషన్లు కంప్లీట్ కావాలి. గతంలో అజిత్ 'వీరం' సినిమా తెలుగు 'వీరుడొక్కడే'గా రీమేక్ చేసినా... 'కాటమరాయుడు'గా పవన్ రీమేక్ చేశారు. ఇప్పుడు 'తేరి'ని రీమేక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Also Read: సాయి పల్లవి - క్రేజ్‌లో లేడీ పవర్ స్టార్!