తిరుగులేని కథానాయకుడు... ఎదురులేని మహానాయకుడు... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి నేడు. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. 


ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మహానాయకుడి నివాళులు అర్పించడం ఆనవాయితీ. హరికృష్ణ కుమారులు, ప్రముఖ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు.






తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తమ అభిమాన కథానాయకుడు, మహానాయకుడిని ప్రజలు స్మరించుకుంటున్నారు.


Also Read: 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహా ఓటీటీలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?


తారక్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చారు. కారును తారక్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. 



Also Read: Top Gun Maverick Movie Review: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?