Aattam OTT Platform, Streaming Details: ఇప్పుడు 'ఆట్టమ్' సినిమా పేరు జాతీయ స్థాయిలో వినబడుతుంది. ఇవాళ్టి వరకు అదొక చిన్న మలయాళ సినిమా. అయితే, నేడు నేషనల్ అవార్డు రావడంతో పెద్ద సినిమాలకు సాధ్యం కాని పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా చూడాలని ప్రేక్షకులు కొందరు కోరుకుంటున్నారు. మరి, 'ఆట్టమ్' ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆట్టమ్' స్ట్రీమింగ్!
Aattam Movie Streaming Details In Telugu: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆట్టమ్' స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 5, 2024లో థియేటర్లలో ఈ సినిమా వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 13న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్' (IFFLA)లో ప్రదర్శించారు. ఈ ఏడాది విడుదలైన సినిమాకు 2022 కేటగిరీలో అవార్డు ఎలా వచ్చింది? అంటే... సినిమా సెన్సార్ డిసెంబర్ 31, 2022కి ముందు పూర్తి అయ్యింది. అదీ సంగతి!
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'ఆట్టమ్'కు ఉత్తమ సినిమాతో పాటు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో దర్శకుడు ఆనంద్ ఏకర్షి, ఎడిటర్ మహేష్ భువనెంద్ కూడా అవార్డులు అందుకోనున్నారు.
Also Read: 2024 ఇయర్ ఎండ్‌లో మళ్ళీ నేషనల్ అవార్డ్స్ - నాలుగు నెలల్లో ఇంకోసారి ఎందుకు ఇస్తున్నారంటే?
Aattam Movie Cast And Crew: 'ఆట్టమ్' సినిమాలో విజయ్ ఫోర్ట్ హీరో. కళాభవన్ షాజాన్ మరో ప్రధాన పాత్ర చేశారు.జరీన్ షిహాబ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇంకా ఈ సినిమాలో అజీ తిరువంకుళం, జాలీ ఆంటోనీ, మదన్ బాబు, నందన్ ఉన్ని, ప్రశాంత్ మాధవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఆనంద్ ఏకర్షి రచన, దర్శకత్వంలో జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకం మీద డాక్టర్ అజిత్ జాయ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. యావత్ మలయాళ చిత్రసీమ ఈ సినిమాకు అవార్డులు వచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు 'ఆట్టమ్' చిత్ర బృందాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ చిత్ర బృందానికి కొందరు ఫోనులు చేశారని తెలిసింది.
మలయాళ సినిమాలకు తెలుగులోనూ అభిమానులు ఉన్నాయి. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలే కాదు... పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్ వంటి యంగ్ స్టార్స్ నటించిన సినిమాలు సైతం తెలుగులో విడుదల అవుతున్నాయి. లేదంటే ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత అయినా సరే వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. అయితే... నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎక్కువ మందికి 'ఆట్టమ్' సినిమా గురించి తెలిసింది.