ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, చిత్రాలకు పురస్కారాలు ప్రకటిస్తుంది. ఆ విషయం ప్రేక్షకులకూ తెలుసు. అది ఆనవాయితీ కూడా! అయితే, ఈ రోజు (ఆగస్టు 16, 2024) అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇయర్ ఎండ్ - 2024 ఆఖరులో ఇంకోసారి అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ రోజు అనౌన్స్ చేశారు కదా! మళ్ళీ ఎందుకు అంటే...
2023లో వచ్చిన సినిమాలకు ఏడాది ఆఖరులో...
71th national film awards 2024: ఇవాళ విడుదలైన నేషనల్ అవార్డ్స్ కొంత మంది ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ఎందుకు? అంటే... ఆ సినిమాలు ఏవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ (కొన్ని మినహాయిస్తే) అయినవి కాదు. రెండేళ్ల క్రితం... అంటే 2022లో రిలీజ్ అయ్యాయి. కొన్ని అప్పటికి సెన్సార్ పూర్తి చేసుకున్నవి. సాధారణంగా గత ఏడాది డిసెంబర్ వరకూ సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ ఏడాది పురస్కారాలు అనౌన్స్ చేస్తారు. మరి, రెండేళ్ల క్రితం వచ్చిన సినిమాలకు ఎందుకు అనౌన్స్ చేశారంటే...
కరోనా కారణంగా పురస్కారాలకు మధ్యలో కొంత విరామం వచ్చింది. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అందువల్ల, అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక, ప్రకటన వంటివి ఆలస్యం అవుతూ వచ్చాయి. ఈ గ్యాప్ కవర్ చేయడం కోసం 2023 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ ఏడాది ఆఖరులో అవార్డులు అనౌన్స్ చేయాలని భావిస్తున్నట్టు నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యూరీ సభ్యురాలు ఒకరు తెలిపారు.
నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి లెక్క సెటిల్ కావాలి!
National Film Awards 2025: కేంద్ర ప్రభుత్వ పెద్దలు, జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ఆలోచన ఒక్కటే... వచ్చే ఏడాదికి ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. 2025లో అనౌన్స్ చేసే 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో విడుదలైన సినిమాలకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకే, 2024 ఏడాది ఆఖరులో మరోసారి అవార్డులు ఇస్తున్నారు. అదీ సంగతి!
Also Read: కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - మొత్తం లిస్ట్ ఇదే
సంతోషంలో 'కార్తికేయ 2' చిత్ర బృందం!
Karthikeya 2 wins best feature film award in 70th National Film Awards: ఈ రోజు ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థతో పాటు 'కార్తికేయ 2' చిత్ర బృందానికి సంతోషం కలిగించాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా అవార్డు అందుకుంది. తెలుగు చిత్రసీమకు చెందిన నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి అవార్డు అందుకున్నారు. ధనుష్, నిత్యా మీనన్ నటించిన 'తిరు చిత్రంబళం'లో పాటకు గాను ఆయన్ను పురస్కారం వరించింది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించిన 'కేజీఎఫ్ 2' కన్నడలో, 'పొన్నియిన్ సెల్వన్ 1' తమిళంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకున్నాయి. ఆ రెండు సినిమాలకు మరిన్ని విభాగాల్లో అవార్డులు వచ్చాయి.