Double iSmart Box Office Collection Day 1: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. మొదటి రోజు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ బరిలో సినిమా మాత్రం కుమ్మేసింది. మొదటి రోజు ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్ లభించింది.
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Double iSmart Movie 1st Day Total WW Collections(Inc GST): 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 12. 45 కోట్లు గ్రాస్ సాధించింది. షేర్ విషయానికి వస్తే... 7.30 కోట్లు! ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. హిందీ కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వచ్చాయి.
ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చాయంటే?
నైజాం (తెలంగాణ): రూ. 2.49 కోట్
లుసీడెడ్ (రాయలసీమ): రూ. 90 లక్షలు
ఉత్తరాంధ్ర (విశాఖ జిల్లాలు): రూ. 76 లక్షలు
ఈస్ట్ గోదావరి: రూ. 44 లక్షలు
వెస్ట్ గోదావరి: రూ. 23 లక్షలు
గుంటూరు: రూ. 70 లక్షలు
కృష్ణా జిల్లా: రూ. 38 లక్షలు
నెల్లూరు: రూ. 20 లక్షలు
ఏపీ, తెలంగాణలో 'డబుల్ ఇస్మార్ట్' తొలి రోజు వసూళ్లు రూ. 6.10 కోట్లు. ఇది షేర్ కలెక్షన్స్ మాత్రమే. ఇందులో వివిధ ఏరియాల హైర్ (డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చిన అడ్వాన్స్) 35 లక్షలు ఉందని తెలిపారు. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలెక్షన్స్ చూస్తే రూ. 65 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ (విదేశాల్లో) ఫస్ట్ డే షేర్ రూ. 55 లక్షలు. మాస్ మూవీస్ ఓవర్సీస్ ఏరియాల్లో అంత కలెక్షన్స్ ఉండవు కనుక ఆ నంబర్స్ ఎక్కువ అని చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్ రూ. 7.30 కోట్లు. గ్రాస్ అయితే... పైన పేర్కొన్నట్టు రూ. 12.45 కోట్లు.
Also Read: వాటీజ్ థిస్ విజయ్ ఆంటోనీ తమిళ 'తుఫాన్'... థియేటర్లలో విడుదలైన వారానికి ఓటీటీలో!
ఆగస్టు 15 హాలిడే 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. ఈ రోజు ఫ్రైడే కనుక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాకు మాస్ ఏరియా, ముఖ్యంగా బీ సీ సెంటర్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బావుంది.
'డబుల్ ఇస్మార్ట్'ను పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఖల్ నాయక్ సంజయ్ దత్ విలన్ రోల్ చేశారు. అలీ కోసం పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ రాశారు. గెటప్ శ్రీను, ప్రగతి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 'డబుల్ ఇస్మార్ట్'కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. 'మార్ ముంత చోడ్ చింత', 'స్టెప్పా మార్' పాటలు విడుదలకు ముందు జనాల్లోకి వెళ్లాయి. సినిమా రీ రికార్డింగ్ కూడా బావుందని ఆడియన్స్ అంటున్నారు.