Prabhutva Saarayi Dukanam Movie : దర్శకుడు నరసింహ నంది పేరు చెబితే తెలుగులో కొందరు ప్రేక్షకులు గుర్తు పడతారు. ఆయన దర్శకత్వం వహించిన '1940లో ఒక గ్రామం' చిత్రానికి 2008 సంవత్సరానికి గాను తెలుగులో ఉత్తమ ప్రాంతీయ సినిమాగా అవార్డు వచ్చింది. ఆ సినిమాను నంది అవార్డు సైతం వరించింది.
'1940లో ఒక గ్రామం' మాత్రమే కాదు... 'కమలతో నా ప్రయాణం', 'లజ్జా' - ఇలా నరసింహ నంది దర్శకత్వం వహించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు చాలా అందుకున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమాలను మెచ్చుకున్నారు. అటువంటి దర్శకుడు ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.
'ప్రభుత్వ సారాయి దుకాణం'...
తెలంగాణాలోని మారుమూల పల్లెలో!Narasimha Nandi New Movie : నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ప్రభుత్వ సారాయి దుకాణం'. శ్రీలక్ష్మి నరసింహ సినిమా సంస్థలో 'ప్రభుత్వ సారాయి దుకాణం' తెరకెక్కుతోంది. పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.
'ప్రభుత్వ సారాయి దుకాణం' సినిమాలో అదితి మ్యాకల్ (Aditi Myakal) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'అమీ తుమీ', '24 కిస్సెస్', 'ఏకం' తదితర సినిమాల్లో ఆమె నటించారు. రీసెంట్ వెబ్ సిరీస్ 'మాయాబజార్', అంతకు ముందు 'పోష్ పోరిస్'లోనూ నటించారు. అదితి పాత్ర సినిమాలో హైలైట్ అవుతుందని టాక్.
Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్
షేక్ స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల పల్లె నేపథ్యంలో 'ప్రభుత్వ సారాయి దుకాణం' సినిమా తెరకెక్కిస్తున్నట్లు నరసింహ నంది చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''రాజకీయ కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకుని... పగ, ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ - ఇలా మనిషిలో వివిధ కోణాలను చూపించే విధంగా ఈ సినిమా కథ సిద్ధం చేశా. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 1980 నాటి పరిస్థితులు మలిచా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. కొంత మంది కొత్త నటీనటులతో పాటు సీనియర్ ఆర్టిస్టులను కూడా తీసుకున్నాం'' అని చెప్పారు.
Also Read : జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ
అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ నరసింహ సినిమా, నిర్మాతలు : పరిగి స్రవంతి మల్లిక్ & నరేష్ గౌడ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రంగు రాము గౌడ్, కూర్పు : వి. నాగి రెడ్డి, సంగీతం : సుక్కు, ఛాయాగ్రహణం : మహి రెడ్డి పండుగల, రచన & దర్శకత్వం : నరసింహ నంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial