నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'కత్తి' సినిమా గుర్తు ఉందా? ఆ చిత్రానికి మల్లి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను' (Madhurapudi Gramam Ane Nenu). ఇందులో శివ కంఠమనేని (Siva Kantamaneni) హీరోగా నటించారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ రెండో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 13న 'మధురపూడి గ్రామం అనే నేను' విడుదల
థియేటర్లలో అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా 'మధురపూడి గ్రామం అనే నేను' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ''మనుషులకు ఆత్మలు ఉన్నట్టే... ఒక ఊరికి కూడా ఆత్మ ఉంటే? ఆ ఆత్మ తన కథ తానే చెబితే? ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడం సంతోషంగా ఉంది'' అని చిత్ర బృందం తెలియజేసింది.
'మధురపూడి గ్రామం అనే నేను' గురించి చిత్ర దర్శకుడు మల్లి మాట్లాడుతూ ''ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దామని 'మధురపూడి గ్రామం అనే నేను' తీశా. ఇందులో ప్రేమ, స్నేహం, రాజకీయాలు, యాక్షన్, ఎమోషన్... అన్నీ ఉంటాయి. ఇదొక మట్టి కథ. మన నేటివిటీ చూపించే కథ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఒంగోలు, చీరాల నేపథ్యంలో కథ సాగుతుంది. రాజమండ్రి, మచిలీపట్నం, హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. హీరో శివ కంఠమనేని అద్బుతమైన నటన కనబరిచారు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఆశ్చర్య పరుస్తారు. భరణి శంకర్, సత్య, నూకరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు'' అని అన్నారు.
Also Read : నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!
చిత్ర నిర్మాతలు కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ''తెలుగులో కాన్సెప్ట్ & కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ 'మధురపూడి గ్రామం అనే నేను' కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా. మేం ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ, భరణి శంకర్, సత్య, నూకరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కె శ్రీనివాసరావు - వై అనిల్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, కూర్పు : గౌతమ్ రాజు, ఛాయాగ్రహణం : సురేష్ భార్గవ్, యాక్షన్ : రామకృష్ణ, స్క్రీన్ ప్లే: నాగకృష్ణ గుండా, మాటలు: ఉదయ్ కిరణ్, సహ నిర్మాతలు: కె శ్రీధర్ రెడ్డి - ఎం జగ్గరాజు, నిర్మాణ సంస్థ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ: జి రాంబాబు యాదవ్, నిర్మాతలు : కేఎస్ శంకర్ రావు - ఆర్ వెంకటేశ్వరరావు, సంగీతం: మణిశర్మ, రచన - దర్శకత్వం : మల్లి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial