Nandamuri Balakrishna's Political Drama Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ రాజకీయ నేపథ్యంలో సినిమా చేయనున్నారా? అదీ ఏపీ ఎన్నికలకు ముందు? పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ సినిమాకు స్క్రిప్ట్, డైరెక్టర్ లాక్ అయ్యారా? అంటే... ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి 'అవును' అని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న, ఆ తర్వాత కమిట్ అయిన సినిమా పూర్తి కాగానే రాజకీయ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలని భావిస్తున్నారట.
బాలకృష్ణతో లేటెస్ట్ 'అఖండ', అంతకు ముందు 'సింహ', 'లెజెండ్' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ రాజకీయ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. బాలయ్య, బోయపాటిది హిట్ కాంబినేషన్. అందులోనూ వీళ్ళిద్దరూ చేసిన సినిమాల్లో పొలిటికల్ పంచ్ డైలాగులు సమాజంలో సమస్యలను సూటిగా ఎత్తి చూపాయి.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న తాజా సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంటా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవి తర్వాత సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారట. షూటింగ్ స్పీడుగా పూర్తి చేసి, 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections - 2024) కు ముందు విడుదల చేయాలనేది ప్లాన్. నిర్మాణ వ్యయం విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని నిర్మాతలు డిసైడ్ అయ్యారట.
'సింహా'లో కావచ్చు, 'లెజెండ్'లో కావచ్చు, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ వచ్చిన 'అఖండ'లో కావచ్చు... రాజకీయాల ప్రస్తావన ఉంది. అయితే, వాటిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. సెంటిమెంట్ ఉంది. కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేయబోయే పొలిటికల్ డ్రామాలో కూడా కమర్షియల్ హంగులు ఉంటాయని, రాజకీయం ప్రధానాంశంగా ఉంటుందని టాక్.
Also Read: కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? హిందువులను అవమానించడమే - ట్రోలింగ్ గురూ
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. దీనికి 'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, చిత్ర బృందం ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నారు. ఆ రెండు అయిన తర్వాత బోయపాటితో డబుల్ హ్యాట్రిక్‌కు ఫస్ట్ స్టెప్ వేయనున్నారు.
Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?