Chinni Official Telugu Teaser: డీగ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?

కీర్తీ సురేష్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చిన్ని'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది.

Continues below advertisement

కథానాయికగా కీర్తీ సురేష్ పంథా భిన్నమైనది. కమర్షియల్ సినిమాలకు పరిమితం కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారు. మదర్ రోల్స్ చేస్తారు. డీ - గ్లామర్ రోల్స్ కూడా చేస్తారు. 'చిన్ని' సినిమా టీజర్ చూస్తే... ఆమె డీ గ్లామర్ రోల్ చేసినట్టు అర్థం అవుతోంది. తమిళ సినిమా 'సాని కాయిదం'కు తెలుగు వెర్షన్ ఇది. కీర్తీ సురేష్‌తో పాటు తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో టీజర్ విడుదల చేశారు.

Continues below advertisement

మేకప్ లేదు, గ్లామర్ అసలే లేదు. కానీ, 'చిన్ని' టీజ‌ర్‌లో కీర్తీ సురేష్ కన్నీరు పెడుతూ కనిపించారు. ఆ కన్నీరులో ఓ కోపం ఉంది. మనసులో రగిలే జ్వాల కనిపిస్తోంది. తమ జీవితాలను చిదిమేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆగ్రహం ఉంది. టీజ‌ర్‌లోనే కీర్తీ సురేష్ ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఇంకెలా ఉంటుందో? మే 6న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ

'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి?' అని కీర్తీ సురేష్ సంధించిన ప్రశ్నతో 'చిన్ని' టీజర్ మొదలైంది. తర్వాత సమాధానం కూడా ఆమె చెప్పారు. 'ఎవరైనా మన మీద రాయి విసిరితే... మనమూ తిరిగి విసరాలి. మన మీద ఉమ్మేస్తే... మనమూ ఉమ్మేయాలి. మనల్ని కొడితే... మనమూ కొట్టాలి. కొందరు మన కలలను కల్లలు చేశారు. మన జీవితాల్ని నాశనం చేశారు. మన ఈ చిన్ని ప్రపంచాన్ని అంతం చేశారు. అలాంటి వాళ్ళను జైల్లో పెడితే చాలా? పగ తీర్చుకున్నట్టు అవుతుందా?' అని! ఆ తర్వాత ఒకరిని షూట్ చేసినట్టు చూపించారు. అదీ సంగతి!

Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement