Balakrishna Movie : బాలకృష్ణ సినిమాకు నో టెన్షన్స్ - నెల రోజుల ముందే

నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాకు లాస్ట్ మినిట్ షూటింగ్ టెన్షన్స్ లేవని చెప్పాలి. ప్లానింగ్ ప్రకారం నెల రోజుల ముందు మేజర్ టాస్క్ ఒకటి కంప్లీట్ చేశారు.

Continues below advertisement

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న ఫ్యాక్షన్  ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). సంక్రాంతి బరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఏమీ లేవు. పక్కా ప్లానింగ్ పరంగా టీమ్ ముందుకు వెళుతోంది. నెల రోజుల ముందు మేజర్ టాస్క్ ఒకటి కంప్లీట్ చేసింది. 

Continues below advertisement

సాంగ్ ఒక్కటే బ్యాలెన్స్!
'వీర సింహా రెడ్డి' టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బుధవారం వెల్లడించింది. ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని పేర్కొంది. త్వరలో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ (Shruti Hassan) మీద ఆ పాటను తెరకెక్కించనున్నారు. షూటింగ్ కంప్లీట్ కావడానికి ముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. 

అనిల్ రావిపూడి సెట్స్‌కు రానున్న బాలయ్య!
'వీర సింహా రెడ్డి' టాకీ పార్ట్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాపై బాలకృష్ణ కాన్సంట్రేషన్ చేయనున్నారు బాలకృష్ణ. ఈ రోజే ఆ సినిమా ఓపెనింగ్. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది వేసవి లేదంటే ఆ తర్వాత విడుదల చేసే ఆలోచనల్లో ఉన్నారట.

Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

రీ రికార్డింగ్‌లో తమన్! 
'వీర సింహా రెడ్డి' పాటలకు ట్యూన్స్ అందించే పని పూర్తి అయ్యిందని, ఇప్పుడు నేపథ్య సంగీతం అందించే పనులు ప్రారంభించామని కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో పాటు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.

బాలకృష్ణ లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ సంగీతం అందించారు. ఆ సినిమా విజయం నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. అంతే కాదు... థియేటర్లలో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' నేపథ్య సంగీతం ఆ సినిమా నేపథ్య సంగీతం మించి ఉండాలని బాలకృష్ణ, నందమూరి అభిమానులు కోరుతున్నారు. 

''సమర సింహా రెడ్డి, అఖండ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆశిస్తున్నాం'', ''బావ గోపికి ఇచ్చిన మాట నిలపెట్టుకో తమన్‌ అన్న…! అఖండ BGM కి మించి ఉండాలి…!'', ''బాక్సులు పగిలిపోవాలి'', ''అఖండను మించి ఉండాలి'', ''తమన్ అన్నా... ర్యాంప్ ఆడించాలి అన్నా'' అని తమన్ ట్వీట్ కింద బాలకృష్ణ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. 'అఖండ'తో తమన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు దాన్ని అధిగమించాల్సి బాధ్యత ఆయనపై ఉంది. 

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర (Naveen Chandra), మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Continues below advertisement