Naga Chaitanya and Sobhita Dhulipala in Europe Vacation: అక్కినేని హీరో నాగచైతన్య నటి శోభితా ధూలిపాళ్లతో సీక్రెట్ రిలేషన్ ఉన్నాడంటూ కొంతకాలం వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ఆధ్యం పోసేలా ఆ మధ్య వీరి లండన్ వెకేషన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన వీరు అక్కడి తెలుగు వ్యక్తితో చైతన్య ఫోటో దిగాడు. ఆ వెనకాలే శోభితా కూడా ఉంది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు ఆ ఫోటో మరింత బలాన్ని ఇచ్చింది.
అయితే ఈ రూమర్స్‌పై చై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ శోభితా మాత్రం తమ మధ్య ఏం లేదని, ఏదో వర్క్ విషయంలో కలిశామంటూ కవర్ చేసింది. అయినా కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీని తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన నాగ చైతన్య, శోభితా మరోసారి బుక్క్ అయ్యారు. తాజాగా వెకేషన్‌లో మరోసారి వీరిద్దరి ఫోటోల బయటకు వచ్చింది. యూరప్ ట్రీప్ నాగ చైతన్య, శోభిత ఒకే దగ్గర ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దీంతో ప్రస్తుతం వీరిద్దరు జంటగా యూరప్ ట్రిప్‌లో ఉన్నారంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఈ ఫోటోలో ఇద్దరు అక్కడ వైన్ టేస్ట్ సెషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నాగచైతన్యను మరోసారి శోభితాతో చూసి చై-సామ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య 'తండెల్' మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో చై మత్స్యకారుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించనున్నాడు, ఇక తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటోలనూ చై తండెల్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఇది రీసెంట్ ఫోటోనే తేలిపోయింది.
Also Read: అమ్మ, అన్నయ్య ముందే డ్రెస్ తీసి చూపించమనేవారు - ఆమని షాకింగ్ కామెంట్స్
సమంత విడాకులు.. ఆ వెంటనే శోభితాతో
కాగా 2017లో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్తి చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల అన్యోన్యంగా జీవించిన ఈ జంట మనస్పర్థ కారణంగా 2021 అక్టోబర్‌లో విడాకుల ప్రకటన ఇచ్చారు. ఇక ఈజంట విడిపోవడాన్ని ఇప్పటికీ వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విడాకులు విషయంలో నాగచైతన్య ముందు నుంచి మౌనంగానే ఉన్నారు. విడిపోయినా సమంతపై తనకు ఎప్పటికి అదే గౌరవం ఉంటుందంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ సామ్ మాత్రం డైవోర్స్ తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. తరచూ తన ఆవేదనన సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా పంచుకుంటుంది. ఇక విడాకులు విషయంలో కొందరు నెటిజన్లను సమంతను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమంతతో విడాకులు ప్రకటించిన కొద్ది రోజులకే నాగ చైతన్య శోభితాతో కలిసి లండన్ వెకేషన్‌లో కనిపించాడు. దీంతో వీరి విడాకులు ఇదే కారణమనే సందేహాలు వచ్చాయి. కానీ శోభితతో ఉన్న రిలేషన్‌పై నాగ చైతన్య ఇప్పటికే వరకు నోరు విప్పలేదు. మరి ఈసారైన ఈ చై ఈ వ్యవహరంపై నోరు విప్పుతాడా? ఎప్పటిలాగే సైలెంట్‌గా ఉంటాడా? చూడాలి!