SP Balasubrahmanyam Jayanthi: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... ఎంతమంది సింగర్స్ ఉన్నా ఆయన స్థానాన్ని ఎవరూ తీసుకోలేదు. అది ఎవరి వల్ల కాదు. ఇప్పటికీ ఆయన లేకపోయినా ఆయన అందించిన పాటలు మాత్రం ఎన్నేళ్లయిన మనతోనే ఉంటాయని ఫ్యాన్స్ అంటుంటారు. బాలసుబ్రహ్మణ్యం మృతిని ఇంకా చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. 5 దశాబ్దాల్లో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఈ లెజెండ్ పుట్టినరోజు నేడు. జూన్ 4న బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆయనను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ లెజెండరీ సింగర్ గురించి ఎక్కువగా తెలియని విషయాలపై ఓ లుక్కేయండి.


రఫీకి పెద్ద ఫ్యాన్..


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేకుండా మ్యూజిక్ లేదు అంటుంటారు ఆయన ఫ్యాన్స్. అలాంటిది ఆయన అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని అనుకోలేదట. ఆయన ఎప్పుడూ ఇంజనీర్ అవ్వాలని కలలు కనేవారని, గెజెటెడ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశానని ఒక సందర్భంలో ఆయనే స్వయంగా తెలిపారు కూడా. ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయనకు రూ. 250 జీతంతో పాటు జీప్‌, డ్రైవర్ లాంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పుకొచ్చారు. యూత్‌గా ఉన్నప్పుడు మహమ్మద్ రఫీకి పెద్ద ఫ్యాన్ అని పలు సందర్భాల్లో బయటపెట్టారు బాలు. ఆయనకంటే పెద్ద రఫీ ఫ్యాన్ అసలు ఉండడని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. కేవలం రఫీ గొంతు వినే అసలు సీన్ ఏంటి అని చెప్పేయొచ్చు అంటూ మహమ్మద్ రఫీపై అభిమానాన్ని చాటుకున్నారు.


అన్ని అలవాట్లు ఉన్నాయి..


కాలేజ్‌లో ఉన్న సమయంలో తను పాటలు బాగా పాడేవారని, అందుకే తన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో తనను బాగా ప్రోత్సహించేవారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే, ఆయన మాత్రం ఎప్పుడూ సింగర్ అవ్వాలని అనుకోలేదట. అంతే కాకుండా సింగర్‌గా ఆయన లైఫ్‌స్టైల్ గురించి పలుమార్లు మాట్లాడారు. ‘‘నాకు సింగింగ్ అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో నేను చాలా ప్యాషన్‌తో ఉంటాను. అలా అని నేను మునిలాగా ఉండాలని అనుకోవడం లేదు. నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం. కుదిరితే అసలు చనిపోద్దని కూడా అనుకుంటున్నాను. నేను చాలా క్రమశిక్షణతో ఉండే ఇతర సింగర్స్‌లాగా కాదు. నేను 35 ఏళ్ల పాటు స్మాక్ చేశారని, అప్పుడప్పుడు డ్రింకింగ్ కూడా చేసేవాడిని’’ అని బయటపెట్టారు బాలు.


సంగీతం తెలియదు..


‘‘నాకు మ్యూజిక్ తెలియదు. స్వరాల గురించి నేను రాసుకుంటూ వాటి గురించి లెక్కలు వేసుకుంటూ నేర్చుకుంటాను. 50 ఏళ్ల పాటు నాకు అస్సలు అర్థం కాని క్లాసికల్ పాటలను నాతో పాడించారు. చిన్నపిల్లలు చాలా బాగా ట్రైనింగ్ తీసుకొని నా ముందు వచ్చి పాడతారు. అసలు వాళ్లను నేను జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి వాళ్లు ఏ రాగంలో పాడుతున్నారని వాళ్లనే అడిగి తెలుసుకుంటాను’’ అని తెలిపారు బాలసుబ్రహ్మణ్యం. కొన్ని పాటలు తాను పాడలేను అనే భయంతో వాటిని రిజెక్ట్ చేసేవారట. ఒకసారి తనకు వచ్చిన ఆరోగ్య సమస్య వల్ల నెలరోజుల పాటు పాడలేకపోయారట బాలు. ఫైనల్‌గా సర్జరీ చేయించుకుందాం అనుకున్న సమయంలో లతా మంగేష్కర్ తనకు వద్దని చెప్పారని బయటపెట్టారు. మొత్తానికి ఆ సర్జరీ బాగా జరిగి మళ్లీ బాలు ఆయన పాటలతో ప్రేక్షకులను అలరించారు.


Also Read: పవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌చల్