Happy Birthday Prashanth Neel: ప్రతి భాషలోనూ సినీ పరిశ్రమను మార్చడానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉండే దర్శకుడు ఒక్కడు ఉంటాడు. అలాగే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమ రాతను మార్చిన దర్శకుడు ఎవరు అంటే చాలా మందికి గుర్తొచ్చే పేరు ప్రశాంత్ నీల్. శాండిల్‌వుడ్ మార్కెట్‌ను పెంచి, యశ్ లాంటి హీరోకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాడు ఈ డైనమిక్ డైరెక్టర్. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కావడంతో శాండిల్‌వుడ్ నుండి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ తనకు సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. ఇక ఈ డైరెక్టర్ గురించి చాలామందికి తెలియని పలు ఆసక్తికర విషయాలు ఏంటో మీరూ చూసేయండి.
రెండో సినిమాతోనే రిస్క్..
2014లో తెరకెక్కించిన ‘ఉగ్రం’ అనే మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ చేశాడు ప్రశాంత్ నీల్. ఇక రెండో సినిమాకే తన స్క్రిప్ట్‌పై, టేకింగ్‌పై ఉన్న నమ్మకంతో శాండిల్‌వుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశాడు ఈ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ను తెరకెక్కించాడు. కేవలం మౌత్ టాక్‌తో ఈ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. పైగా తన టేకింగ్ మాత్రమే కాదు... యశ్ యాక్టింగ్ కూడా ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సక్సెస్‌లో కీలకంగా నిలిచింది. ఇక తన ఫ్యాన్స్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం. దానినే షార్ట్‌కట్‌లో నీల్‌గా మార్చుకున్నాడు.
పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్..
శాండిల్‌వుడ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్... అసలైతే తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని మదకసిరకు చెందినవాడు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి... ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు రఘువీర రెడ్డి సోదరుడు. సుభాష్ రెడ్డి బెంగుళూరులో సెటిల్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ కూడా తన కుటుంబంతో పాటు అక్కడే ఉండిపోయాడు. ఈ డైరెక్టర్ ఒక రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చారని చాలామందికి తెలియదు. తన పెద్దనాన్న రఘువీర్.. మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్. ప్రశాంత్ నీల్‌కు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే కాదు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. తన సోదరి విద్యను కన్నడ నటుడు శ్రీమురళికి ఇచ్చి పెళ్లి చేశారు.
వారితో బంధుత్వం..
‘కేజీఎఫ్’లో ఇనాయత్ ఖళీ పాత్రలో కనిపించిన బాలకృష్ణ నీలకంఠపురం కూడా ప్రశాంత్ నీల్‌కు బంధువే. ‘గూగ్లీ’ మూవీలో యశ్ పర్ఫార్మెన్స్‌ను చూసి ఇంప్రెస్ అయిన ప్రశాంత్ నీల్... తనకు ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్ పాత్రను పోషించే అవకాశం ఇచ్చాడు. తన డెబ్యూ మూవీ ‘ఉగ్రం’ అని అందరికీ తెలుసు. కానీ దానికంటే ముందే ‘ఆ హుడుగి నీనే’ అనే స్క్రిప్ట్‌ను రాసుకున్నాడట ప్రశాంత్. ఆ కథను శ్రీమురళీకి చెప్పకముందే ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యింది. అందుకే శ్రీమురళీనే దృష్టిలో పెట్టుకొని తను రాసిన ‘ఉగ్రం’ కథ సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. ఇక తాజాగా ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కలిసి ‘ఉగ్రం’ కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి ‘సలార్’ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.
Also Read: ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ తెలుగు ట్రైలర్ - ఈ సారి మరింత భయానకంగా.. ఫన్నీగా సీక్వెల్