'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి (Miss Shetty Mr Polishetty Review) ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో కామెడీ బావుందని ఎన్నారైలు చాలా గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు మెగా బూస్ట్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. తనకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నచ్చిందని, థియేటర్లలో మళ్ళీ చూడాలని ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి, సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఏమిటి? వాళ్ళు ఏమంటున్నారు? వంటి వివరాల్లోకి వెళితే... 


అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ఆల్రెడీ సినిమా కథ ఏమిటి? అనేది ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని ఓ మహిళ కోరుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది క్లుప్తంగా కథ. దీనిని వినోదాత్మకంగా చెప్పారని ఎన్నారై ఆడియన్స్ అంటున్నారు. 


క్లీన్ కామెడీ ఎంటర్టైనర్!
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్న మాట. ఇటీవల తెలుగులో వచ్చిన సినిమా ఇదొక బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. కథాంశం చిన్నది అయినప్పటికీ... కామెడీ సినిమాను గట్టెక్కించిందట.  


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' టైప్ క్లీన్ కామెడీ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. సిట్యువేషన్ పరంగా వచ్చే కామెడీ సీన్లు క్లిక్ అయ్యాయని అంటున్నారు. కామెడీ టైమింగ్ విషయంలో ముందు సినిమాలతో నవీన్ పోలిశెట్టి తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మరోసారి ఆయన అదరగొట్టారట.






నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ కన్ఫర్మ్!
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవడం పక్కా అంటున్నారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి కొందరు ప్రత్యేకంగా పోస్టులు చేస్తున్నారు. 'భాగమతి' తర్వాత ఐదేళ్లకు థియేటర్లలోకి వచ్చిన అనుష్క మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆవిడ హిట్ అందుకున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది 3 ప్లస్ రేటింగ్స్ ఇస్తున్నారు.


Also Read : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?



కావాలని పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారా?
ఓవర్సీస్ రివ్యూలు చూసిన కొందరికి మరో సందేహం కూడా వస్తోంది. కావాలని మరీ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారా? అని! ఓ నెటిజన్ అయితే... సినిమా తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. జస్ట్ 1.75 రేటింగ్ ఇచ్చారు.


Also Read : కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విలన్‌గా నటిస్తున్న అనుష్క - ఆ సినిమాలో ఆమె రోల్ అదేనా?






గమనిక : సోషల్ మీడియాలో కొందరు నెటి'జనులు' పేర్కొన్న అభిప్రాయాలను ఇక్కడ యథాతథంగా ఇవ్వడం జరిగింది. ఆ పోస్టుల్లో పేర్కొన్న అంశాలకు ఏబీపీ దేశం ఎటువంటి బాధ్యత వహించదు. కేవలం ప్రజల అభిప్రాయాలు తెలియజేయడం మాత్రమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్విట్టర్ రివ్యూలు చూస్తే...