Anushka On Marriage : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?

Anushka Shetty Marriage : అనుష్క కథానాయికగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పెళ్లి మీద ఆవిడ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Continues below advertisement

మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాని అందాల భామల జాబితా తీస్తే... అందులో అనుష్క పేరు (Anushka Shetty) పేరు ముందు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆమె వయసు 41 ఏళ్ళు. అందుకని, ప్రేక్షకుల్లో చాలా మంది చూపు ఆమె పెళ్లి మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Continues below advertisement

అనుష్క శెట్టి కంటే వయసులో చిన్న వారైన కొందరు అందాల భామలు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఏడు అడుగులు వేసిన తర్వాత కూడా యాక్టింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కథానాయికలకు పెళ్లి ఎంత మాత్రం అడ్డంకి కాదు. మరి, అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి మీద ఆమెకు మంచి అభిప్రాయం ఉందా? లేదా? అని కొందరిలో సందేహాలు కూడా వస్తున్నారు. వీటికి తాజా ఇంటర్వ్యూలో ఆమె సమాధానం ఇచ్చారు. 

పెళ్లికి వ్యతిరేకం కాదు - అనుష్క!
తాను పెళ్లికి వ్యతిరేకం కాదని అనుష్క శెట్టి స్పష్టం చేశారు. నవీన్ పోలిశెట్టికి జోడీగా ఆమె నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty) ఈ నెల 7న (గురువారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుష్క... పెళ్లి గురించి కూడా మాట్లాడారు. 

''పెళ్లి, పిల్లలు, కుటుంబ బంధాలు... ఇవన్నీ చాలా అందమైనవి. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ పెళ్లి అయినా... ఎందులో అయినా సరే ఓ ఎమోషన్ ఉండాలి. అది సహజంగా జరగాలని, దానికి సరైన సమయం రావాలని నేను నమ్ముతాను. ప్రేమ, ఎమోషన్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు'' అని అనుష్క పేర్కొన్నారు. 

ప్రస్తుతానికి పెళ్లి ప్లాన్ లేదు - అనుష్క
ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏదీ లేదని అనుష్క స్పష్టం చేశారు. పెళ్లి అనేది మంచి విషయం అని, తనకు పెళ్లి కుదిరినప్పుడు తప్పకుండా చెబుతానని ఆమె తెలిపారు. తాను గుడికి వెళ్లిన ప్రతిసారీ పెళ్లి గురించి లేదా మరొక విషయంపై చర్చ జరుగుతుందని, దాని వల్ల తన తల్లిదండ్రులు తన కుమార్తె గురించి అందరూ ఎంతో కేర్ తీసుకుంటున్నారని సంతోష పడుతున్నారని తెలిపారు. 

Also Read : రజనీకాంత్ సినిమాలో రానా దగ్గుబాటి - రీ ఎంట్రీ అదేనా!?

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. థియేటర్లలో మళ్ళీ సినిమా చూడాలని ఉందని పేర్కొన్నారు. మెగా అభినందనలతో చిత్ర బృందం సంతోషపడుతోంది. 

Also Read : నేనూ సచిన్ ఫ్యాన్ - మరో వందేళ్లయినా మరో టెండూల్కర్ పుట్టడు : ముత్తయ్య మురళీధరన్

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ :  యువీ క్రియేష‌న్స్‌, నిర్మాత‌లు:  వంశీ - ప్ర‌మోద్‌, ర‌చ‌న‌ & ద‌ర్శ‌క‌త్వం:  మ‌హేష్ బాబు .పి, సంగీతం : రధన్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం :  నిర‌వ్ షా, నృత్యాలు :  రాజు సుంద‌రం & బృందా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : రాజీవ‌న్‌. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement