తక్కువ బడ్జెట్ చిత్రాలు.. సూపర్ హిట్ అని మౌత్ టాక్ సంపాదించుకుంటే తప్పా.. వాటిని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అందుకే చాలావరకు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయిన నెలరోజుల్లోనే ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఆ ఓటీటీ అమౌంట్‌తో అయినా లాభాలు తెచ్చుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో చిన్న చిత్రం కూడా ఆహాలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘మాయాపేటిక’. ఇటీవల ‘మాయాపేటిక’ సినిమా తమ ఓటీటీలో విడుదల అవుతున్న విషయాన్ని ఆహా స్వయంగా ప్రకటించింది. 


స్మార్ట్ ఫోన్‌కు బయోపిక్..
‘బేబి’ సినిమాలో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్.. ఆ మూవీ విడుదలయిన కొన్నిరోజుల్లోనే.. తను హీరోగా నటించిన మరో  మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ‘బేబి’ హిట్ అయినంతగా ఆ మూవీ హిట్ అవ్వలేకపోయింది. అదే ‘మాయాపేటిక’. అసలు మొబైల్ ఫోన్ అనేది లేకుండా ఈరోజుల్లో ఒకరు కూడా లేరు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ లేకుండా అసలు ఈరోజుల్లో బ్రతకడమే కష్టం అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అలాంటి మొబైల్‌కు మాటలు వస్తే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా ‘మాయాపేటిక’ అనే స్మార్ట్ ఫోన్ బయోపిక్ అంటూ మూవీ టీమ్ డిఫరెంట్‌గా ప్రమోషన్స్ కూడా చేసింది. 


రెండు నెలల తర్వాత ఓటీటీలోకి..
రమేశ్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విరాజ్‌కు జోడీగా సిమ్రత్ కౌర్ నటించగా.. పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో కనిపించింది. వీరితో పాటు సునీల్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల, రజత్ రాఘవ్ లాంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. జూన్ 30న ‘మాయాపేటిక’ థియేటర్లలో విడుదలయ్యింది. కానీ అదే సమయంలో మరెన్నో సినిమాల విడుదలలు, రీ రిలీజ్‌ల కారణంగా ‘మాయాపేటిక’ గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియలేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో హిట్ టాక్ అందుకున్న సినిమా కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో వచ్చేస్తోంది. కానీ ‘మాయాపేటిక’ మాత్రం ఓటీటీలో రావడానికి ఇంత సమయం పట్టింది.


ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
స్మార్ట్ ఫోన్ బయోపిక్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కడంతో ‘మాయాపేటిక’ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా జరిగాయి. తమ సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనేక సినీ సెలబ్రిటీలను రంగంలోకి దించింది మూవీ టీమ్. అయినా కూడా థియేటర్లలో దీనికి తగిన ఆదరణ లభించలేదు. దీంతో ఓటీటీలో అయినా ఈ సినిమాకు తగిన ఆదరణ లభిస్తుందని మూవీ టీమ్ ఆశిస్తోంది. జూన్ 30న థియేటర్లలో విడుదలయిన ‘మాయాపేటిక’.. సెప్టెంబర్ 15న ఆహాలో స్ట్రీమ్‌కానుంది. ఈ వరల్డ్ ప్రీమియర్ చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఆహా.. తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక విరాజ్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేసిన ‘బేబి’ మూవీ కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుండడంతో దాంతో పాటు విరాజ్ నటించిన ఈ మూవీని కూడా చాలామంది చూసి ఆదరించే అవకాశాలు ఉన్నాయని ‘మాయాపేటిక’ టీమ్ భావిస్తోంది. ‘బేబి’, ‘మాయాపేటిక’ లాంటి యూత్‌ఫుల్ మూవీలతో ప్రేక్షకులకు దగ్గరయిన విరాజ్.. మరిన్ని యూత్‌ఫుల్ సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






Also Read: మీ మూవీతో రూ.8 కోట్లు నష్టపోయాం, మమ్మల్నీ ఆదుకోండి - విజయ్ దేవరకొండకు ‘డెవిల్’ నిర్మాత షాకింగ్ ట్వీట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial