'కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ... రావడం మాత్రం పక్కా' - 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. సినిమా ఛాన్సుల విషయంలో కొంత మంది ఆర్టిస్టులను చూస్తే ఈ డైలాగ్ చెప్పవచ్చు. సినిమాల్లో వాళ్ళకు అవకాశాలు రావడం లేట్ కావచ్చు ఏమో! కానీ, అవకాశాలు రావడం మాత్రం పక్కా! నవీన్ పోలిశెట్టి, సుహాస్, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్ మీదకు హీరోలుగా వచ్చిన వాళ్ళే. ఈ లిస్టులో కొత్తగా చేరిన నటుడు కుమార్ కాసారం (Kumar Kasaram).
'మీటర్'లో కుమార్ కాసారం
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మీటర్' (Meter Telugu Movie). ఏప్రిల్ 7న... మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుక చూస్తే... అందులో షార్ట్ ఫిల్మ్ హీరో కుమార్ కాసారం గురించి కిరణ్ ప్రత్యేకంగా చెప్పాడు. తమ జర్నీలు గుర్తు చేసుకున్నాడు. ఎవరీ కుమార్ కాసారం అంటే...
యూట్యూబ్ సిరీస్ 'విజయ్ గాడి వీర గాథ'తో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు కుమార్ కాసారం. అతడిది నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి. బీటెక్ చదివిన తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. చిన్నతనం నుంచి నటన మీద మక్కువతో ఉండటంతో చిత్రసీమ వైపు అడుగులు వేశాడు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశాడు. నటుడుగా యూట్యూబ్ ఫిల్మ్స్ ఎక్కువ రావడం... 'మజిలీ', 'ఓ బేబీ', 'సార్' సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు రావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి టాటా చెప్పేసి ఇటు వచ్చేశాడు. 'మీటర్' సినిమా దర్శకుడు దర్శకుడు రమేష్ సైతం కుమార్ కాసారం షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో చూసి ఛాన్స్ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన 'దసరా' సినిమాలో సైతం కొంత మంది యూట్యూబ్ స్టార్స్ కనిపించారు. రవితేజ నన్నిమల, రియాజ్ వంటి నటులకు మంచి గుర్తింపు వచ్చింది. కుమార్ కాసారం సైతం తనకు అటువంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాడు.
త్వరలో హీరోగా కుమార్ కాసారం!?
'మీటర్' తర్వాత కథానాయకుడిగా సినిమా చేయడానికి కుమార్ కాసారం రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, ఆల్రెడీ యూట్యూబ్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉండటంతో అతడిని హీరోగా పెట్టి సినిమా చేయడానికి కొంత మంది ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఓ సినిమాకు సంతకం చేసినట్టు తెలిసింది. ’ ప్రీ రీలిజ్ తరువాత కుమార్ కాసారంకి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట. ఓ సినిమాకు సంతకం చేశారట.
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!
'మీటర్' విషయానికి వస్తే... 'వినరో భాగ్యము విష్ణు కథ' తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రమిది. పక్కా కమర్షియల్ ఫార్మాటులో సినిమా సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాతో తమిళ కథానాయిక అతుల్యా రవి (Athulya Ravi) తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. రమేష్ కడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు.
Also Read : నీ భార్యకు, నీకు సంబంధం ఏమిటో చెప్పగలవా? - విష్ణు వర్సెస్ మనోజ్ గొడవపై మోహన్ బాబు