తెలుగు చలన చిత్రసీమలో క్రమశిక్షణకు కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu)ను మారు పేరుగా చెబుతారు. అటువంటి లెజెండరీ నటుడి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇప్పుడు యావత్ తెలుగు ప్రజలు, ఇతర పరిశ్రమ జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనేది అందరికీ తెలిసిందే.


మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి డిలీట్ చేశారు. అయితే, అప్పటికే చాలా మంది దానిని డౌన్ లోడ్ చేసుకున్నారు. తన దగ్గర పని చేసే సారథి ఇంటికి వచ్చి, తన అన్నయ్య విష్ణు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. 'రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ' పేరుతో మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ గొడవపై స్పందించడానికి మోహన్ బాబు నిరాకరించారు. 


నీ భార్యకు, నీకు సంబంధం ఏమిటో చెప్పగలవా?
తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాల్గొన్నారు. విష్ణు, మనోజ్ మధ్య జరిగిన గొడవ గురించి మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... ''నీ ఇంట్లో నీ భార్యకు, నీ మధ్య సంబంధం ఏమిటో చెప్పగలవా? తప్పయ్యా! చదువుకున్న విజ్ఞానులు మీరు! మీరందరూ నాకు ఇష్టం. ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి. సమయం, సందర్భం ఉండాలి. ఆస్పత్రి ఓపెనింగుకు వచ్చాను. హాస్పటల్ అత్యద్భుతంగా ఉండాలి'' అని మోహన్ బాబు చెప్పారు. 


వ్యంగ్యంగా స్పందించిన మనోజ్!
భార్య భూమా నాగ మౌనిక రెడ్డి (Bhuma Naga Mounika), తండ్రి మోహన్ బాబుతో కలిసి మనోజ్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఆ తర్వాత 'వాట్ ది ఫిష్' 'మనం మనం బరంపురం' సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. కెనడాలో షూటింగ్ చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇటీవల వివాదాల గురించి ప్రశ్నించమని అడగ్గా... వ్యంగ్యంగా స్పందించారు. 


Also Read జై భజరంగ్ బలి - ప్రభాస్ 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?



గొడవ జరిగిన కొన్ని రోజులకు చావడానికి అయినా సిద్ధమే అని మనోజ్ పోస్టులు చేశారు. దాంతో అన్నదమ్ముల మధ్య గొడవ మరింత వేడెక్కిందని, సయోధ్య కుదర్చడానికి మోహన్ బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చాలా మంది భావించారు. అయితే, ఆ తర్వాత విష్ణు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. 'హౌస్ ఆఫ్ మంచుస్' పేరుతో రియాలిటీ షో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దాంతో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేకుండా పోయింది. నిజంగా రియాలిటీ షో కోసం చేసిన పబ్లిసిటీ స్టంటా? లేదంటే గొడవలు ఉన్నాయా? అనేది ఎవరికీ అర్థం కాలేదు.  


Also Read : దుబాయ్‌లో ఉపాసన సీమంతం






చావనైనా చస్తాను కానీ...
''negativity is the enemy of creativity'' (నెగిటివిటీయే క్రిటివిటీకి శత్రువు) అని మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ''I would rather die fighting for what is right, than live passively amidst all that is wrong'' అని! అంటే...  ''ఏమీ జరగనట్టు (తప్పుల్ని) అలా చూస్తూ ఉండిపోవడం కన్నా... నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే'' అని ఆ కోట్ సారాంశం. ''మీరు బతకండి. మమ్మల్ని బతకనివ్వండి. అందరికీ ప్రేమతో'' అని మంచు మనోజ్ పేర్కొన్నారు. ఆ పోస్టుకు, తర్వాత విష్ణు పోస్ట్ చేసిన వీడియోకి సంబంధమే లేదు.