కుమారుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni)తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పారిస్ వెళ్లారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తండ్రి తనయులు ఇద్దరూ కనిపించారు. రెండు వారాల పాటు మహేష్ హాలిడే ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ మూడో వారంలో ఇండియాకి రిటర్న్ కానున్నారు.
ఆల్రెడీ పారిస్ (Paris)లో...
నమ్రత & సితార పాప!
సాధారణంగా మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి విదేశాలకు వెళుతూ ఉంటారు. బట్, ఫర్ ఎ చేంజ్... ఈసారి ఇంట్లో మహిళలు ముందు వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే మహేష్ సతీమణి నమ్రత, కుమార్తె సితార పారిస్ వెళ్లారు. ఇప్పుడు వాళ్ళతో తండ్రి తనయులు జాయిన్ అవుతారు.
త్రివిక్రమ్ సినిమా షూటింగులో మహేష్ బాబు బిజీ బిజీగా ఉండటంతో ఆయనకు ముందుగా వెళ్ళడం కుదరలేదు. పరీక్షలు ఉండటంతో గౌతమ్ ఇక్కడ కూడా ఇండియాలో ఉండిపోయారని సమాచారం. ఇప్పుడు ఇద్దరూ వీలు చూసుకుని పారిస్ వెళుతున్నారు.
త్రివిక్రమ్ సినిమా ఎంతవరకు వచ్చింది?
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సుమారు పదమూడేళ్ళకు మహేష్ బాబు, మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరింది. SSMB 28 సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ముగిసింది. మహేష్, పూజా హెగ్డే (Pooja Hegde) పాల్గొనగా... కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.
ఇంతకు ముందు 'మహర్షి'లో మహేష్ సరసన పూజా హెగ్డే నటించారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్, పూజా హెగ్డే హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల మరో కథానాయిక.
నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?
ఏప్రిల్ 21న ఎస్ఎస్ఎంబి 28 లేటెస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో మహేష్ కూడా జాయిన్ అవుతారని, ఆ లోపు ఇండియా వస్తారని సమాచారం. కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మహేష్, త్రివిక్రమ్ నిర్విరామంగా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. సాంగ్స్ మినహా సినిమాలో మెజారిటీ టాకీ పార్ట్, భారీ యాక్షన్ సీన్లు చాలా వరకు తీసేశారు. పాటల కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read : జై భజరంగ్ బలి - ప్రభాస్ 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ మే 31న జన్మించారు. ప్రతి ఏడాది ఆ రోజున తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కృష్ణ జయంతి (Krishna Death Anniversary)కి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : దుబాయ్‌లో ఉపాసన సీమంతం - భార్యతో రామ్ చరణ్