Upasana Baby Shower : దుబాయ్‌లో ఉపాసన సీమంతం - భార్యతో రామ్ చరణ్

ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన సీమంతం దుబాయ్‌లో జరిగింది. రామ్ చరణ్ సహా కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఆ వేడుక జరిగింది.

Continues below advertisement

కుటుంబం... సినిమా... రెండిటిని బ్యాలన్స్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు సాగుతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగుతో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆస్కార్స్ వేడుక ముగిసిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన రామ్ చరణ్ (Ram Charan)... వెంటనే 'గేమ్ చేంజర్' షూటింగులో పాల్గొన్నారు. ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ నృత్య దర్శకత్వంలో ఓ సాంగ్ చేశారు. 

Continues below advertisement

సాంగ్ షూటింగ్ ఫినిష్ చేశాక... తన పుట్టినరోజు సందర్భంగా ఆస్కార్ విజేతలను ఇంటికి పిలిచి చిత్రసీమ ప్రముఖుల సమక్షంలో సత్కరించారు. ఆ తర్వాత సతీమణి ఉపాసన (Upasana Konidela) తో కలిసి దుబాయ్ వెళ్ళారు. అక్కడ శ్రీమతి సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. 

దుబాయ్‌లో ఉపాసన సీమంతం
రామ్ చరణ్, ఉపాసన దంపతులు లాస్ట్ వీకెండ్ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ ఉపాసన సీమంతం వేడుకలు జరిగాయి. కుటుంబ స‌భ్యులు, కొంత మంది సన్నిహిత మిత్రులను మాత్రమే ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఉపాసన సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ వేడుకను నిర్వ‌హించారు. 

ఉపాసన అమ్మమ్మ కూడా...
ఉపాసన సీమంతం వేడుకకు ఆమె అమ్మమ్మ, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భార్య సుచరితా రెడ్డి కూడా పాల్గొన్నారు. హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను ఆమె దోచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సీమంతం వేడుక వీడియో షేర్ చేశారు ఉపాసన

బేబీ బంప్‌తో కనబడుతున్న ఉపాసన
ఆస్కార్ వేడుకల నుంచి ఉపాసనను గమనిస్తే... బేబీ బంప్‌తో కనబడుతున్నారు. ఆ మధ్య జరిగిన రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) ఫొటోల్లోనూ ఉపాసన బేబీ బంప్ హైలైట్ అయ్యింది.రామ్ చరణ్ పుట్టిన రోజున ఉపాసన వేసుకున్న డ్రస్ చూశారా? బ్లూ కలర్ డ్రస్ ధరించారు. అందులో బేబీ బంప్ చాలా క్లారిటీగా కనిపించింది. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానులు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. 

Also Read : జై భజరంగ్ బలి - 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) వివాహం ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? జూన్ 14, 2012లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వివాహమైన పదకొండేళ్లకు వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కానున్నారు. అపోలో ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులతో పాటు కొంత మంది విదేశీ వైద్యుల పర్యవేక్షణలో డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఉపాసన డెలివరీకి ఫేమస్ అమెరికన్ గైనకాలజిస్ట్!
ఫిబ్రవరి 22న 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా, అందులోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆస్కార్ నామినేట్ కావడం వంటి అంశాలతో పాటు షోలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. త్వరలో ఆయన తండ్రి కానున్న నేపథ్యంలో ఆ ప్రస్తావన కూడా వచ్చింది. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి తమరు అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.

Also Read గ్యాంగ్‌స్టరా? స్మగ్లరా? టెర్రరిస్టా? యాక్షన్‌తో కుమ్మేసిన అరుణ్ విజయ్ & అమీ

Continues below advertisement