షాహిద్ కపూర్ భార్యగా బాలీవుడ్ కుటుంబంలోకి అడుగు పెట్టింది మీరా రాజ్ పుత్. కేవలం 21 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. కానీ మీరా వాటినెప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు షాహిద్-మీరా జంటకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు. బాలీవుడ్ హీరోలే కాదు, వారి భార్యలు ఏం చేసినా కూడా అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. మీరా రాజ్ పుత్ కొన్నేళ్ల క్రితం ఓ టాటూ వేయించుకుంది. అది కనిపించని చోట వేసుకోవడంతో ఆమె టాటూ వేసుకున్న సంగతి షాహిద్ అభిమానులకు తెలియలేదు. ఇప్పుడు కొన్ని ఫోటోల ద్వారా ఆ టాటూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు నెటిజన్లు.
మీరా తన ఎడమ భుజానికి దగ్గరగా ఉన్న వీపు భాగంపై టాటూ వేయించుకుంది. అది ఒక కలువ పువ్వు. కలువ పువ్వు స్వచ్ఛతను, ఆధ్యాత్మిక భావనను, శాంతిని సూచిస్తుంది. అమ్మాయిలకు కచ్చితంగా ఈ టాటూ నచ్చుతుంది. జీవితంలో శాంతంగా, స్వచ్ఛంగా ఉండాలనే గాఢమైన కోరిక కలవారు ఇలాంటి టాటూలు వేయించుకుంటారని అంటున్నారు టాటూయిస్టులు. అమ్మాయిలు వేసుకునే డిజైన్లలో సీతాకోకచిలుకలు, రకరకాలపూలు, డాడ్ అనే పేరు, లవ్ సింబల్స్, తమ పేరుతోని మొదటి అక్షరం... ఇలాంటివి ముందు స్థానాల్లో ఉంటాయని తెలిపారు. ఆధునిక యువత టాటూ వేయించుకోవడాన్ని ట్రెండీగా భావిస్తున్నారు.
మీరా- షాహిద్ జంటకు 2015లో పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలైనా హీరోయిన్లను తలదన్నే అందం మీరా సొంతం. ఇప్పటివరకు వెండితెరపై ఒక్కసారి కూడా కనిపించకపోయినా ఆమె ఫేమ్ మామూలుగా లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 28 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఆమె ఒక్క పోస్టు పెడితే గంటల్లో వైరల్ గా మారిపోతుంది. ఆమె అప్పుడప్పుడు మోడలింగ్ కూడా చేస్తుంది. బికినీ నుంచి లెహెంగా వరకు అనేక రకాల డ్రెస్సుల్లోని ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. షాహిద్- మీరా దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...
Also read:మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!
Also read: విఘ్నాధిపతికి గోధుమ కుడుముల నైవేద్యం..
Also read:అదిరే అందంతో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్