బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ టాస్క్ లో ఎవరు గెలుస్తారు? ఇంటి కెప్టెన్ గా ఫస్ట్ ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు అసక్తిని రేపుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన ‘శక్తి చూపరా ఢింబకా’ పవర్ రూమ్ టాస్క్ కొనసాగుతోంది. ఎవరైతే ఎక్కువ సార్లు పవర్ రూమ్ లోకి వెళ్తారో వాళ్లకి కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయి. దీంతో  ఇంటిసభ్యులంతా పవర్ రూమ్ యాక్సెస్ కోసం కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నరేంజ్ లో ప్రయత్నిస్తున్నారు. అప్పుడే గ్రూపులుగా విడిపోయారా అన్నంతగా వాదించుకుంటున్నారు. మొదటగా పవర్ హౌజ్ లోకి విశ్వ అడుగుపెట్టాడు. ఆ తర్వాత మానస్, సిరి వెళ్లారు. లేటె్స్ట్ ప్రోమోలో పవర్ రూమ్ యాక్సెస్ హమీదకి లభించింది. లోపలకు వెళ్లిన ఆమెని బిగ్ బాస్ ఒకరి పేరు చెప్పమన్నారు. ఆ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరని చెప్పారు. దీంతో హమీద ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ నాటకీయపరిణామంలో హమీద ఎవర్ని ఎంచుకుంటుంది అనేది వ్యూవర్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది.



ఇప్పటికే చాలామంది హమీద లహరి పేరు చెబుతుందని అనుకుంటున్నారు కానీ ఆమె ప్రియ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంట్లో అడుగపెట్టిన క్షణం నుంచి లహరి-హమీద మధ్య పెద్దగా పొసగ లేదు. చీటికి మాటికి టామ్ అండ్ జెర్రీగా వాదనలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు బుధవారం ఎపిసోడ్ లో ఒకరికొకరు సారీ చెప్పుకుని రియలైజ్ అయ్యారు. ఇలాంటి సమయంలో హమీదకు పవర్ రూమ్ యాక్సెస్ లభించడంతో మొదట్నుంచీ తనకు పొసగని లహరిపై ప్రయోగిస్తందని అంతా భావిస్తున్నారు కానీ హమీద ప్రియ పేరు చెప్పినట్లుగా సమాచారం. అంటే ఇక  ప్రియ ఎప్పటికీ ఇంటి కెప్టెన్ కాలేదన్నమాట.


Also Read: మోహన్ బాబు వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు.. దాని గురించి నరేష్-శివాజీలను అడగండి


ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా విశ్వ , మానస్, సిరి, హమీదలు రేస్ లో నిలిచారు. వీరిలో ‘సిరి’ కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. సిరి టాస్క్ లో భాగంగా లోబోని సేవకుడిగా షణ్ముక్ ని యజమానిగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ఇక సిరి ఫైనలైతే మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మొట్టమొదటి కెప్టెన్ మహిళ కావడం విశేషం.


Also Read:అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కామెంట్స్


Also read:నేడు ఆహాలో ‘ద బేకర్ అండ్ బ్యూటీ’స్ట్రీమింగ్ ... మొదటి ఎపిసోడ్ ఫ్రీగా చూసేయండి


Also Read: గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు... ఆ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు.. ట్యాంక్ బండ్ వైపు ఆంక్షలు