వెబ్ సిరీస్ లను విడుదల చేయడంలో ఆహా ఓటీటీ ముందుంది. తరగతి గది దాటి, కుడి ఎడమైతే, ఇన్ ద నేఫ్ ఆఫ్ గాడ్ ... ఇలా ఈ ఏడాదే వరుసపెట్టి వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసింది.  ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు కొత్త వెబ్ సిరీస్ ‘ద బేకర్ అండ్ బ్యూటీ’ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో మొత్తం పది ఎపిసోడ్లు ఉంటాయి. వాటిలో మొదటి ఎపిసోడ్ ను ఉచితంగా చూడొచ్చు. ‘జిందగీలో ఒకటి యాద్ పెట్టుకో తమ్ముడు... పోరీ ఎంత కిరాక్ ఉంటే అన్ని కష్టాలొస్తాయ్’ అంటూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణు ప్రియ, వెంకట్ కీలక పాత్రలు పోషించారు. 


దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా ఓటీటీ సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది అమెరికాలో విడులైన టీవీ సిరీస్ ‘ద బేకర్ అండ్ ద బ్యూటీ’ని ఆధారంగా చేసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టు దీన్ని రూపొందించారు.  బేకర్ అయిన అబ్బాయి,  ఫిల్మ్ స్టార్ అయిన అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఇదని, ప్రేమలు, గొడవలు, మధ్యతరగతి జీవితాలు ఇలా చాలా కోణాల్లో కథ సాగుతుందని చెప్పారు వెబ్ సిరీస్ మేకర్స్. ఇందులో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఇప్పటికే మంచి హీరోగా గుర్తింపు సాధించాడు. ‘ఏక్ మినీ కథ’తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇందులో చాలా గ్యాప్ తరువాత అక్కినేని వెంకట్ ఇందులో నటించారు.