'ఆర్ఎక్స్ 100'తో ఒక్కసారిగా తెలుగు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకొన్న దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా 'మహాసముద్రం' తీశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా తాజా సినిమా 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


'మంగళవారం' సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన చిత్రమిది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఆ రెండిటికీ మంచి స్పందన లభిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 


అక్టోబర్ 21న 'మంగళవారం' ట్రైలర్
Mangalavaram movie Trailer : అక్టోబర్ 21న 'మంగళవారం' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఈ రోజు వెల్లడించింది. అంటే... ఈ శనివారమే ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్






నవంబర్ 17న 'మంగళవారం' విడుదల  
'మంగళవారం' సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఇటీవల తెలిపారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథ, కథనాలు ముందుకు వెళతాయి. పాయల్ క్యారెక్టర్ చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారు. థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్ ఇచ్చే చిత్రమిది'' అని చెప్పారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు వచ్చిన స్పందన పట్ల నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. 


Also Read 'మ్యాన్షన్‌ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్‌ వెబ్‌ సిరీస్‌ - భయపెట్టిందా? లేదా?



'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి  ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్ - రాఘవ్, కళా దర్శకత్వం : మోహన్ తాళ్లూరి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్ - పృథ్వీ, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial