తాను భోజన ప్రియురాలు అని సీనియర్ కథానాయిక, నగరి ఎమ్మెల్యే రోజా (Roja) తెలిపారు. అంతే కాదు... తనకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ప్రస్తుతం ఫాలో అవుతున్న డైట్ ఏంటి? వంటి విషయాలు కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న రోజా ఒక్కసారిగా ఫుడ్ గురించి మాట్లాడటానికి కారణం ఏమిటి? అంటే.... నటి శ్రీవాణి, విక్రమాదిత్య రెడ్డి దంపతులు & సందీప్. హైదరాబాద్, మణికొండలో వాళ్ళు స్టార్ట్ చేసిన 'మీ కడుపునిండా - Taste Of Telugu' రెస్టారెంట్ సోమవారం రోజా చేతుల మీదుగా ప్రారంభమైంది. అక్కడ తనకు ఇష్టమైన రుచులు, తన డైట్ ప్లాన్ గురించి రోజా వివరించారు. 


రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏమిటంటే?
ఎప్పుడు మంచి భోజనం చూసినా... తనకు 'ఆహా ఏమి రుచి తినరా మైమరచి' పాట గుర్తుకు వస్తుందని రోజా చెప్పారు. 'మీ కడుపునిండా' రెస్టారెంటులో భోజనం చేశాక జనాలు కూడా ఆ పాట పాడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 


రొయ్యల ఇరుగు, పీతల ఫ్రై, కీమా ఉండలు, చేపల పులుసు, రాగి సంగటి అంటే తనకు ఎంతో ఇష్టమని రోజా చెప్పారు. ప్రస్తుతం తాను డైట్ ఫాలో అవుతున్నానని, అయితే తనకు ఇష్టమైన వంటలు చేయించినట్లు శ్రీవాణి చెప్పడంతో ఈ ఒక్క రోజుకు డైట్ పక్కన పెట్టేశానని వివరించారు. 


రోజూ రోజా తినే ఫుడ్ ఏమిటి?
ప్రతి రోజూ ఉదయం తాను ఓట్స్ తింటానని రోజా చెప్పారు. అందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుని తింటానని ఆమె వివరించారు. మధ్యాహ్న భోజనంలో అయితే నాన్ వెజ్ కంపల్సరీగా ఉండాల్సిందేనని రోజా అన్నారు. కార్తీక మాసం లేదా గుడికి వెళ్లిన రోజుల్లో అయితే నాన్ వెజ్ అసలు ముట్టుకోనని చెప్పారు. చేపల పులుసు, నాటు కోడి కూర, పీతలు ఎక్కువ తింటానని ఆమె అన్నారు. రాత్రి వేళకు వస్తే దోస లేదా ఇడ్లీ  తింటానని అన్నారు. 


Also Read పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'


రాజకీయాలు లేదా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఇప్పుడు వంట చేయడం చాలా తగ్గిందని రోజా తెలిపారు. కొవిడ్ సమయంలో మాత్రం ఎక్కువగా వంట చేశానని అన్నారు. అప్పుడు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశానని, అందరూ ఆ వంటలు ట్రై చేయవచ్చని చెప్పారు. తాను వండిన వంటలు ఎలా ఉన్నాయో తన భర్త సెల్వమణి, పిల్లలు చెప్పాలన్నారు. మినిష్టర్ అయ్యాక తన పరిస్థితి ఫుట్ బాల్ మాదిరిగా తయారయ్యిందని ఆవిడ చెప్పారు. రవళి తనకు మంచి ఫ్రెండ్ అని, చెన్నైలోనూ & ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత తమ ఇళ్లు పక్క పక్కన ఉండటంతో ఎక్కువ కలిసి తినేవాళ్లమని అన్నారు. 


మహేష్ అమ్మగా మాత్రం నటించను!
ప్రస్తుతం సినిమాలను తాను మిస్ అవుతున్నానని రోజా చెప్పారు. అయితే... ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓటు వేయడంలో వాళ్లకు సేవ చేయడంలో బిజీగా ఉన్నానని చెప్పారు. మహేష్ బాబుతో నటించాలని ఉందని చెప్పారు. అయితే... మహేష్ అమ్మగా మాత్రం చేయనని చెప్పారు. ఆయనకు అక్క లేదా వదిన పాత్రలు చేస్తానని చెప్పారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో 'కాంతార', 'బేబీ' సినిమాలు బాగా నచ్చాయని రోజా చెప్పారు.  


Also Read బెంగళూరులో విజయ్ సినిమా టికెట్ రేటు యమ ఘాటు - 'లియో'కి 2500 ఏంటి స్వామి?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial