Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 17 ఎపిసోడ్


రిషి, మహేంద్ర, వసుధార ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తండ్రిని చూసి రిషి బాధపడుతుంటే..వసుధార ఎప్పటిలానే ఓదార్పు యాత్ర చేపట్టింది. 
రిషి: నేను ఏ తప్పూ చేయలేదు కదా
వసు: మీరు తప్పుచేయడం ఏంటి సార్
రిషి: డాడ్ కి పెదనాన్న అంటే ప్రాణం.. అందరకీ డాడ్ ని దూరం చేసి తప్పుచేశాను అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచీ నాన్, పెదనాన్న ఎప్పుడూ విడిగాలేరు..ఇప్పుడు డాడ్ ని దూరంగా తీసుకొచ్చి వాళ్లిద్దరి మధ్యా బంధం తెంపేశాను
వసు: ఇదేం శాశ్వత దూరం కాదు..మహేంద్ర సార్ వల్ల అక్కడ ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని తీసుకొచ్చారు.. సార్ మళ్లీ నార్మల్ అయిన తర్వాత మనం మళ్లీ ఆ ఇంటికి వెళదాం 
వెళతామా వసుధారా అని రిషి అంటే..కచ్చితంగా వెళతాం సార్ అంటుంది..


Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్


వంటిల్లో ఉన్న వసుధార దగ్గరక వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అని రిషి అడిగితే...నేను విందు భోజనాలు ప్రిపేర్ చేయడం లేదు కదా అంటుంది. సరే అయితే నేను వెళ్లిపోనా అనగానే..మీ హెల్ప్ అవసరం లేదన్నాను కానీ మిమ్మల్ని వెళ్లిపొమ్మని చెప్పలేదు..మీరుంటే చాలు అంటుంది. ఇద్దరూ కలసి కాఫీ తాగుతారు...( ఇద్దరూ మనసులోనే మాట్లాడుకుంటారు)
రిషి: ఈ క్షణం కోసం మనం ఎన్నాళ్ల నుంచో కలలు కన్నాం కదా 
వసు: ఆ కల నిజం అవడం సంతోషంగా ఉంది..మనింట్లో మనం ఇలా కాఫీ తాగడం బావుంది
ఏంటి వసుధారా..ఏం అనుకుంటున్నావంటూ వసు మనసులో మాట చెప్పేస్తాడు.. అవును సార్ అని ఒప్పుకున్న వసుధార... ఈ సంతోషం వెనుక జగతి మేడం త్యాగం ఉంది సార్ అని గుర్తుచేస్తుంది
రిషి: మనకు ఆ లోటు తీర్చలేనిది..మనం సంతోషంగా ఉంటేనే అమ్మ సంతోషంగా ఉంటుంది..  మనం మిషన్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, కాలేజీ చూసుకోవాలి...అవును నువ్వు ఎన్నింటికి వెళతావు
వసు: ఇప్పట్లో వెళ్లలేను ఏమో సార్
రిషి: బాధ్యత బాధ్యతే..బాధ బాధే..ఎండీగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇది..ఇప్పుడు నువ్వు వెళ్లకపోవడం సరైన నిర్ణయం కాదు. ఇన్నాళ్లూ కాలేజీ ఏఏ విషయాల్లో వెనుకబడిందో అన్నింటినీ పూర్తిచేసుకుని కాలేజీని ముందుకు నడిపించాలి.. అందుకే కాలేజీకి వెళ్లాల్సిందే..
వసు: మీరు రారా సార్..
రిషి: ఈ రోజుకి అయితే వస్తాను...


Also Read: MD ( మై డార్లింగ్) - MH ( మై హార్ట్) అంటూ మురిసిపోయిన రిషిధార, శైలేంద్రకి ధరణి వార్నింగ్!


కాలేజీకి వచ్చిన దేవయాని, శైలేంద్ర..ఎందుకు రమ్మన్నావని అడుగుతారు..
రిషి: వసుధార ఎండీ సీట్లో కూర్చునేందుకు బోర్డు మెంబర్స్ అందరూ సైన్ చేశారు..ఇక మీరిద్దరూ సైన్ చేయాలి
అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితుల్లో సంతకం చేస్తారు దేవయాని, శైలేంద్ర...
వసుధార నువ్వు ఎండీగా ఉండేందుకు బోర్డ్ మెంబర్స్ అందరూ ఈ ఫైల్ పై సైన్ చేశారు..అందరూ ఆమోదం తెలిపినట్టే..నువ్వు కూడా ఎండీ పదవి స్వీకరించినట్టు సంతకం చేస్తే ఈ క్షణం నుంచి నువ్వు అధికారికంగా కాలేజీకి ఎండీ అయినట్టే...సంతకం పెట్టు వసుధార అంటాడు.. వసుధార ఆలోచనలో పడుతుంది..ఎందకు ఆలోచిస్తున్నావ్ సంతకం పెట్టు అని చెబుతాడు.. నువ్వు ఇప్పుడు పెట్టే ఈ సంతకమే సువర్ణ అక్షరాలుగా నిలిచిపోతుందని చెబుతాడు..
దేవయాని-శైలేంద్ర రగిలిపోతుంటారు... ( వసుధార సంతకం పెట్టకుండా చేయి దేవుడా అనుకుంటాడు శైలేంద్ర)
వసుధార ...కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుంచీ జరిగిన సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటుంది...
వసు: జగతి మేడం రిఫరెన్స్ తో నేను ఈ కాలేజీలో అడుగుపెట్టినప్పుడు నన్ను ఇక్కడ ఉండనీయకుండా చేయాలి అనుకున్నారు..
రిషి: అవును...నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఆపలేకపోయాను..ఈ రోజు ఎండీ సీట్లో కూర్చుంటావని ఆరోజే రాసిపెట్టి ఉందేమో..
దేవయాని: కొందరికి అలా రాసిపెట్టి ఉంటుందేమో
రిషి: రాసిపెట్టి ఉండడం కాదు..వసుధారకి ఆ క్యాపబులిటీ ఉంది..అందుకే అందరం కలసి ఆమెను ఎంపిక చేసుకున్నాం
వసు: నేను చదువుకున్న కాలేజీకి ఎండీ అయ్యానంటే అంతా జగతి మేడం ఆశీర్వాదమే.. ఆమె ప్లేస్ లోకి నేను వచ్చాను..అది భర్తీ చేయగలనో లేదో కానీ మేడం స్ఫూర్తిని నా మనసులో పెట్టుకుంటాను..ఆ స్ఫూర్తి ప్రకారమే పనిచేస్తాను..ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్తాను..
రిషి: నేను స్టూడెంట్ కోసం చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ నీ సహకారం ఉంది..నీ తెలివితేటలు, ప్రతిభ కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి
తప్పకుండా సార్..అందుకు నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను అంటూ బ్యాగ్ లోంచి పెన్ను తీసి సైన్ చేస్తుంది...
దేవయాని-శైలేంద్ర కూడా తప్పదన్నట్టు కంగ్రాట్స్ చెబుతారు...
రిషి: ఇకనుంచి నువ్వు డీబీఎస్టీ కాలేజీకి ఎండీవి..ఇకపై నీ కనుసన్నల్లోనే అందరం నడుచుకోవాలి..నువ్వు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలి.. అన్నయ్య, పెద్దమ్మ అందరూ నువ్వు చెప్పినట్టే వింటారు, నువ్వు చెప్పినట్టే పనిచేస్తారు.. ఏం అంటావ్ పెద్దమ్మా..
దేవయాని: వసుధార నిర్ణయం బట్టి అందరం మసులుకోవాలి.. కాలేజీలో మాత్రమే...ఇంట్లో మాత్రం నేను చెప్పినట్టు నడుచుకోవాలి
పెద్దమ్మా మీ మాట కాదంటుందా అని అంటాడు రిషి... దేవయాని-శైలేంద్ర వెళ్లిపోతారు


Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!


మళ్లీ MH, MD అంటూ కాసేపు మురిసిపోతారు.. ఆ తర్వాత ఎండీసీట్లో రిషిని కూర్చోబెడుతుంది..ఇది నాది కాదు నీది అంటాడు రిషి.. ఎప్పుడైతే ఆ ఫైల్ పై సంతకం చేశావో నువ్వు అధికారికంగా కాలేజీ ఎండీవి..ఈ సీటుకి మీరే అర్హులు ఎప్పటికైనా జరిగిదే ఇదే అని క్లారిటీ ఇస్తుంది వసు.  
వసుధార మాట్లాడుతుంటుంది..రిషి చూసి మురిసిపోతుంటాడు. మీరు ఈ సీట్లో కూర్చునేవరకూ ఎదురుచూస్తాను... అప్పటివరకూ శ్రీరాముడి పాదుకలను సింహాసనం పెట్టి భరతుడు పాలన చేసినట్టు..మిమ్మల్ని,జగతి మేడం ని తలుచుకుంటూ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాను..
రిషి: నీకు అనుక్షణం అండగా ఉంటాను..నువ్వు నా దగ్గర ఏ విషయం దాచొద్దు..అది నన్ను బాధపెట్టేది అయినా, సంతోషించేది అయినా..
వసుధార నవ్వుతూ ఉంటే గమనించి.. ఎందుకు నవ్వుతున్నావ్ అని అడుగుతాడు..
వసు: ఒకప్పుడు నేను మీ క్యాబిన్లోకి రావాలంటే పర్మిషన్ అడిగేదాన్ని అంటుంది
వెనుకే ఉన్న జగతి ఫొటో చూసి..చూశావా అమ్మా..మీ శిష్యురాలు పాత విషయాలు గుర్తుచేసుకుని నన్ను ఏడిపించాలని చూస్తోంది... కానీ నేను భరిస్తాను..తను ఎండీగా మంచి ప్లేస్ కి వెళ్లాలని ఆశిస్తున్నాను..
వసు: మీ అబ్బాయిగారు చెప్పినట్టే చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని వసుధార అడుగుతుంది...
అదే సమయానికి దండ ఊగుతుంది... అమ్మ ఎక్కడున్నా మనల్ని గమనిస్తుందని చెప్పేసి... నీ వర్క్ చూసుకో నేను బయటకు వెళుతున్నా అనేసి వెళ్లిపోతాడు...