అందరూ భోజనానికి కూర్చుంటే మహేంద్ర ఎక్కడ ఉన్నాడని ఫణీంద్ర ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. రిషి బాధగా లేచి డాడ్ ఎక్కడ ఉంటారో తెలుసని.. వెళ్ళి తీసుకొస్తానని అంటాడు. అప్పుడే మహేంద్ర తాగి తూలుతూ ఇంట్లోకి వస్తాడు. పడిపోబోతుంటే రిషి పట్టుకుంటాడు.
మహేంద్ర: నువ్వు కష్టకాలంలో నాకు తోడు ఉంటాడని ధైర్యం నాకు. ఇంటికి రాకూడదని అనుకున్నా కానీ నువ్వు మళ్ళీ నాకోసం రోడ్డు మీద తిరుగుతూ బాధపడతావని వచ్చాను అనేసి ఐలవ్యూ చెప్తూ రిషిని ముద్దుపెట్టుకుంటాడు.
దేవయాని:ఏంటి మహేంద్ర ఇది ఏం జరుగుతుంది. నువ్వు ఏమైపోతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఇంట్లో వయసు వచ్చిన కొడుకు ఉన్నాడు, కొత్తగా పెళ్ళయిన కోడలు ఉంది. వాళ్ళ సంతోషం గురించి ఆలోచించకుండా నువ్వు చేస్తుంది ఏంటి?
ఫణీంద్ర: దేవయాని అరవకు.
దేవయాని: అసలు మహేంద్ర ఎందుకు ఇలా చేస్తున్నాడు? జగతి టైమ్ అయిపోయింది వెళ్ళిపోయింది. దానికి నాలుగు రోజులు ఏడ్చి మళ్ళీ మర్చిపోయి మన పనులు మనం చేసుకోవాలి. ఇలా తాగేసి వస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది. రిషి చూడు నీకోసం ఎంత కంగారుపడుతున్నాడో..
Also Read: MD ( మై డార్లింగ్) - MH ( మై హార్ట్) అంటూ మురిసిపోయిన రిషిధార, శైలేంద్రకి ధరణి వార్నింగ్!
రిషి: పెద్దమ్మ మీరు నా గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు ఇన్ని చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేరు బాధలో తాగారు.
దేవయాని: బాధ ఎవరికి ఉండదు. బాధ ఉందని మనుషులని పట్టించుకోకుండా ఆలోచించకుండా మందు తాగుతూ కూర్చుంటారా? జగతి చనిపోయిందని నాకు బాధ ఉంది అయితే నేను తాగుతాను ఇవ్వు మహేంద్ర.
ఫణీంద్ర: మతి ఉండే చేస్తున్నావా ఈ పని..
దేవయాని: ఛీ ఛీ ఈ కొంప ఏంటి ఇలా తయారైంది. అసలు ఇల్లా బారా ఇది? ఏం అర్థం కావడం లేదు.
రిషి: సారీ పెద్దమ్మ.
దేవయాని: ప్రతిరోజూ మహేంద్ర తప్పతాగి ఇంటికి వస్తుంటే బుద్ధి చెప్పాల్సిన అన్నకి మాట రాదు. నీకు తండ్రిని అనడానికి నోరు పెగలదు ఏంటో ఈ ఖర్మ. నేను ఏమైనా అంటే బాధ అంటారా? బాధ ఉంటే ఇలా తాగి తందనాలు ఆడాలా?
రిషి: పెద్దమ్మ ఇక్కడ ఎవరు తందనాలు ఆడటం లేదు. జస్ట్ తాగారు అయినా చిన్న దానికి ఎందుకు అలా అరుస్తారు?
దేవయాని: చిన్నది ఏంటి నేను మొన్న కూడా చెప్పాను. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదా? పెద్దదాన్ని ఒక మాట చెప్తే పట్టించుకోరే..
మహేంద్ర: ఏం అర్థం చేసుకోవాలి వదిన. తాగాల్సిందే మోసాలు బయటకి చెప్పలేనప్పుడు, కుట్రలు బయట పెట్టలేనప్పుడు, మనుషులు ప్రాణాలు తీస్తున్నప్పుడు.. వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు తాగాల్సిందే. ఇంకేం చేయాలి . బాధ పోయేలా చేసుకోవాలంటే తాగడం తప్ప ఏం చేయలేను. నేను ఇప్పటికిప్పుడు మానమంటే మానలేను.
దేవయాని: ఇన్ని చెప్పినా మానను అంటే తెగించేశారు. మన ఇంటి పరువు తీస్తున్నారు. నేను చెప్పే మంచి చెవికి ఎక్కడం లేదు. హుందాగా ఉండాల్సిన కుటుంబం మీద ఉమ్మి వేస్తారు.
శైలేంద్ర: అలా అనకు మమ్మీ రిషి బాధపడతాడు.
దేవయాని: మహేంద్ర ఇలా తాగొచ్చి రభస చేస్తానంటే నేను చూడలేను. నేను ఈ ఇంట్లో ఉండలేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను.
రిషి: పెద్దమ్మ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మేమే వెళ్తాం.
ఫణీంద్ర: ఏంటి ఆ మాటలు..
రిషి: డాడ్ వల్ల ఎవరూ ఇబ్బంది పడటం చూడలేను. మా వల్ల ఎవరూ తలదించుకోవాల్సిన అవసరం లేదు.
దేవయాని: అలా అంటావ్ ఏంటి రిషి మీ నాన్న మారాలని కదా నేను అన్నది.
రిషి: ఆయన ఇప్పుడు వినిపించుకునే పరిస్థితిలో లేరని చెప్తూనే ఉన్నాను కానీ మీరు అంటూనే ఉన్నారు. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు నన్ను ఏమైనా అనండి భరిస్తాను. కానీ డాడ్ ని ఒక్కమాట అన్నా తట్టుకోలేను. నా ముందే అన్నేసి మాటలు అంటుంటే గుండె పగిలిపోతుంది. అందుకే నా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను.
Also Read: కళ్యాణ్ మాటలకి ఫీలైన అప్పు- భర్త ప్రేమకి మురిసిన కావ్య
ఫణీంద్ర: తను ఏదో వాగిందని..
రిషి: ఇది పెద్దమ్మకి ఇష్టం లేదు ఆమెకి ఇష్టం లేని పని. తనకి ఇష్టం లేని పని నేను చేయను. మా డాడ్ వల్ల మన కుటుంబం పరువు పోతుందట. అది పోకుండ ఉండాలంటే డాడ్ బయటకి పోవాలి. కుటుంబ బాధ్యత నిలబెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అందుకే డాడ్ ని తీసుకుని బయటకి వెళ్తాను.
శైలేంద్ర: వద్దు రిషి వెళ్లొద్దు.
రిషి: పెద్దమ్మ మాటలు నా గుండెకి బలంగా తాకాయి. ఉన్నా ఎడమొహం పెడమొహంగా ఉండాలి నేను ఉండలేను. నా తండ్రిని అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడ ఉండలేను.
దేవయాని: నేను మామూలుగా మాట్లాడాను..
రిషి: మీరు మాట్లాడిన ప్రతి మాట నా మనసుని గాయం చేసింది మేం వెళ్లిపోతాం. నేను ఇక్కడ ఉంటుండే డాడ్ కోసం ఆయన్ని అంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేసి జగతి ఫోటో తీసుకుని మహేంద్రని తీసుకుని వెళ్లిపోతారు. ఫణీంద్ర ఎంత బతిమలాడినా కూడ రిషి వినిపించుకోడు. సారీ పెదనాన్న అనేసి వెళ్లిపోతారు.
శైలేంద్ర: ఏంటి మమ్మీ ఇలా చేశావ్ నేను ఏదో సైగ చేస్తే నువ్వు వాళ్ళని బయటకి వెళ్లిపోయేలా చేశావ్. వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ ప్లాన్స్ తెలిసేవి కానీ ఇప్పుడు వాళ్ళని దూరంగా తోసేశావ్. ఇక వాళ్ళని మనం ఏం చేయలేం. కళ్ల ముందు ఉంటేనే వసుని తట్టుకోలేం. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో..
ఫణీంద్ర: ఏం మాట్లాడుతున్నారు..
శైలేంద్ర: అసలు నీకు ఎన్ని సార్లు చెప్పాను నోరు అదుపులో పెట్టుకోమని. నీ నోరు ఈ ఇంటికి శని పట్టించింది.
దేవయాని: నేనేం చేశాను వాళ్ళని ఏమైనా దగ్గరుండి వెళ్ళగొట్టానా..?
ఫణీంద్ర: అవును నువ్వే వెళ్ళగోట్టావ్. అప్పుడు జగతి వెళ్లిపోవడానికి కారణం నువ్వే.. ఇప్పుడు నా తమ్ముడు వెళ్లిపోవడానికి కారణం నువ్వే ఛీ ఛీ