బిగ్ బాస్ సీజన్ 7లో బ్యాక్ టు బ్యాక్ లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు. తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌజ్‌లోకి అడుగుపెట్టిన నయని పావని కూడా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిపోయిన ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్.. రతిక, దామిని, శుభశ్రీలలో ఎవరో ఒకరికి బిగ్ బాస్ మరో అవకాశం అందించాలని అనుకున్నారు. అందుకే మళ్లీ వారిని బిగ్ బాస్‌లోకి పిలిచారు. కానీ వారు మళ్లీ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అవ్వాలంటే.. ఆ నిర్ణయం హౌజ్‌మేట్స్ చేతిలో ఉందని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో రతిక, దామిని, శుభశ్రీ.. వారికి ఓట్లు వేయమంటూ అప్పీల్ చేసుకున్నారు. దీంతో సండే ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఓటింగ్ జరిగింది.


చివర్లో సూపర్ ట్విస్ట్..
ముందుగా దామిని, ఆ తర్వాత రతిక, ఇటీవల శుభశ్రీ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. కానీ బిగ్ బాస్ నుండి వెళ్లిపోయే సమయానికి రతిక, దామినిలపై బయట విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. శుభశ్రీ మాత్రమే హౌజ్‌లో సేఫ్ గేమ్ ఆడుతూ.. అందరితో మంచి కంటెస్టెంట్ అనిపించుకొని వెళ్లిపోయింది. బయట శుభశ్రీకి పాపులారిటీ ఎలా ఉన్నా.. హౌజ్‌లో మాత్రం కంటెస్టెంట్స్‌కు తనపై పెద్దగా నెగిటివ్ అభిప్రాయాలు ఏమీ లేవు. అందుకే శుభశ్రీకే ఎక్కువ ఓట్లు పడతాయని, తనే మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. 


శుభశ్రీకే ఎక్కువ ఓట్లు..
కంటెస్టెంట్స్ అంతా దామిని, రతిక, శుభశ్రీలలో ఎవరికి కావాలో వారికి ఓట్లు వేశారు. చాలావరకు ఓట్లు శుభశ్రీకే వచ్చుంటాయి, తనదే రీఎంట్రీ అని అందరు అనుకునేలోపే ఎక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వరని, తక్కువ ఓట్లు సాధించినవారు మాత్రమే రీఎంట్రీ ఇస్తారని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నయని పావని ఎలిమినేషన్‌కు ముందు బిగ్ బాస్ హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో చాలామంది కంటెస్టెంట్స్ శుభశ్రీకి సపోర్ట్ చేసేవారే ఉన్నారు. అందరికంటే తక్కువ ఓట్లు పడే ఛాన్స్ రతికకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్లిపోయే సమయానికి రతికపై చాలా నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి తనను సపోర్ట్ చేస్తే తాము కూడా నెగిటివ్ అయిపోతామేమో అని కంటెస్టెంట్స్‌లో అనుమానం ఉండవచ్చు.


వంటలక్కకే ఎక్కువ సపోర్ట్..
నాగార్జున ఇచ్చిన క్లారిటీతో శుభశ్రీ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం అనేది అసాధ్యం అని అనిపిస్తోంది. దీంతో రతిక, దామినిలో ఎవరో ఒకరికి ఆ అవకాశం దక్కుతుంది. దామిని ఎక్కువగా కిచెన్‌లో ఉండేది కాబట్టి, వంటలక్క అని పేరు కూడా తెచ్చుకుంది కాబట్టి తనతో పాటు కిచెన్‌లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ తనకే ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దామిని వెళ్లిపోయిన తర్వాత ప్రియాంక వంటలక్కగా మారింది. దామిని ఉన్నప్పుడు కూడా వీరిద్దరూ కలిసి కిచెన్ బాధ్యత చూసుకునేవారు. ఇక వీరిద్దరితో పాటు సందీప్ కూడా కిచెన్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడే కాబట్టి ప్రియాంక, సందీప్ ఓట్లు ఎక్కువగా దామినికి పడే ఛాన్సులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అసలు రతికను సపోర్ట్ చేయడానికి ఒక్క కంటెస్టెంట్ కూడా ఉండకపోవచ్చు. దీంతో రతిక రీఎంట్రీ కన్ఫర్మ్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.


Also Read: గుక్కపెట్టి ఏడ్చిన పావని, ఆమెకు బదులు నేను వెళ్తానని శివాజీ రిక్వెస్ట్ - బయటకు పంపేసిన ‘బిగ్ బాస్’