‘బిగ్ బాస్’ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) సోమవారం ఎపిసోడ్‌లో ‘బిగ్ బాస్’.. శివాజీ చెయ్యి ఎలా ఉందని అడిగాడు. దీంతో కాస్త నొప్పిగా ఉంటుందని, ఆడటం కష్టంగా ఉంటుందని శివాజీ తెలిపారు. దీంతో బిగ్ బాస్ ఆయన్ని హౌస్ నుంచి బయటకు రావాలని, స్కానింగ్ చేసిన తర్వాత తిరిగి వెళ్లొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని హౌస్‌మేట్స్‌కు చెప్పి బయటకు రావాలని చెప్పాడు. అయితే, శివాజీ వెళ్లిపోతున్నా.. ప్లే వెల్ అని పేర్కొన్నారు. దీంతో హౌస్ మేట్స్ చాలా వర్రీ అయిపోతూ.. ఆయన్ని వెళ్లొద్దు అని అడ్డుకుంటున్నారు. కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపించింది. స్కానింగ్ కోసం వెళ్తున్నా అని చెప్పినా.. ఎవరి నటనలో వారు మునిగి తేలారు. ఆ తర్వాత కొద్ది సేపటికి శివాజీ.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 


నా మనోభావాలు దెబ్బతిన్నాయ్: శోభాశెట్టి 


‘‘ఆదివారం షోలో నా మెడలో బ్రెయిన్‌లెస్ బోర్డు వేశారు. దానివల్ల మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఈ రీజన్‌తో నామినేషన్ వేసుకోవచ్చు కదా. ఇది సేఫ్ గేమ్’’ అంటూ శోభాశెట్టి.. తేజాను ఉద్దేశిస్తూ చెప్పింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ కెప్టెన్ యావర్‌కు వీఐపీ రూమ్‌ను కేటాయించాడు. ఇంటి సభ్యుల్లో ఇద్దరిని డిప్యుటీలుగా ఎంచుకోవాలని తెలిపారు. డిప్యూటీలు వీఐపీ రూమ్‌లో నిద్రపోవడమే కాకుండా.. స్ప్రైట్ కూలర్ కూడా ఉపయోగించుకొనే వీలు ఉంటుంది. ఈ వారం మొత్తం రేషన్ సరిపడేలా.. కెప్టెన్ చూసుకోవడానికి డిప్యూటీ సహకరించాలి. ఎవరు ఎక్కడ నిద్రపోవాలో డిప్యుటీలతో చర్చించి బెడ్ కేటాయించాలి. ఈ సందర్భంగా యావర్ ఫస్ట్ డిప్యుటీగా శివాజీ, సందీప్‌లను ఎంపిక చేసుకున్నాడు. 


అమర్‌దీప్ పేరు మరిచిపోయిన అశ్వినీ


ఐదు వారాలు ఉన్నారు చాల్లే అన్నట్లుగా మాట్లాడారు అంటూ అమర్ దీప్.. అశ్వినీని నామినేట్ చేశాడు. అయితే, అశ్వినీ.. అమర్‌దీప్ పేరుకు బదులు ప్రశాంత్ పేరును పిలిచింది. పదే పదే ప్రశాంత్ పేరు చెప్పడంతో అమర్‌దీప్ అసహనానికి గురయ్యాడు. 


ప్రశాంత్, సందీప్‌ మధ్య ‘ఊరుడో’ గొడవ


పల్లవి ప్రశాంత్, సందీప్ మధ్య నామినేషన్ కాస్తా.. వేరే దారికి వెళ్లింది. కెప్టెన్‌కు ఎదురు చెప్పకూడదంటూ పల్లవి ప్రశాంత్ సందీప్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సందీప్ కూడా పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. సందీప్ తనని ఊరోడు అన్నాడని ఆరోపించారు. దీంతో షాకైన సందీప్.. ప్రశాంత్‌ను ఎప్పుడూ ఊరోడు అని అనలేదని అన్నాడు. ఈ సందర్భంగా తన ఇష్టమైన డ్యాన్స్‌పై ఒట్టేస్తున్నానని పేర్కొన్నాడు. తాను అలా అన్నది నిజమని పొలంపై అన్నంపై ఒట్టేసి చెప్పు అని సందీప్ అడగడంతో పల్లవి ప్రశాంత్.. మాట మార్చాడు. దీంతో శివాజీ కలుగజేసుకుని ‘‘నువ్వు ఊరోడు అన్నావు’’ అని చెప్పగానే పల్లవి ప్రశాంత్ కవర్ చేసుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని శనివారం హోస్ట్ నాగార్జున తప్పకుండా ప్రస్తావించవచ్చు. సోమవారం ఎపిసోడ్ పూర్తయ్యేసరికి భోలే, అశ్వినీలకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. వారి తర్వాతి స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.


ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే..:


⦿ పల్లవి ప్రశాంత్ - సందీప్‌, తేజాను నామినేట్ చేశాడు.
⦿ అమర్ దీప్ - భోలే, అశ్వినీ శ్రీలను నామినేట్ చేశాడు. 
⦿ పూజా మూర్తి - భోలే, అశ్వినీ శ్రీలను నామినేట్ చేసింది.
⦿ సందీప్ - భోలే, పల్లవి ప్రశాంత్‌‌లను నామినేట్ చేశాడు. 
⦿ అర్జున్ - భోలే, అశ్వినీ శ్రీలను నామినేట్ చేశాడు. 
⦿ ప్రియాంక - అశ్వినీ శ్రీ, భోలేలను నామినేట్ చేసింది.
⦿ తేజ - పల్లవి ప్రశాంత్
* ఇంకా శోభాశెట్టి, శివాజీ, యావర్, అశ్వినీ, భోలే, గౌతమ్ నామినేషన్స్ చేయాల్సి ఉంది. 


Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూస్తారా? అసలు విషయం చెప్పేసిన నాగార్జున